భూభారతి దరఖాస్తుల పరిష్కారంపై నిర్మల్ కలెక్టర్ కీలక ఆదేశాలు

కలం, నిర్మల్: పెండింగ్ భూభారతి దరఖాస్తులను వెంటనే పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా (Collector Bhavesh Mishra) అధికారులను ఆదేశించారు. శనివారం నిర్మల్ (Nirmal) జిల్లా కలెక్టరేట్‌లోని సమావేశ మందిరంలో పెండింగ్ భూ భారతి దరఖాస్తుల పరిష్కారం, రీ సర్వే ప్రక్రియ నిర్వహణ అంశాలపై సంబంధిత అధికారులతో సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. పెండింగ్‌లో ఉన్న భూభారతి దరఖాస్తులను వెంటనే పరిష్కరించాలని అన్నారు. మండలాల వారిగా పెండింగ్‌లో ఉన్న దరఖాస్తుల వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. దీర్ఘకాలికంగా పెండింగ్‌లో ఉన్న భూభారతి దరఖాస్తులన్నీ పరిష్కరించాలని ఆదేశించారు.

అవసరమైన దరఖాస్తులను తమ స్థాయి నుంచి పై స్థాయికి పంపాలని, ప్రతి దరఖాస్తును క్షుణ్ణంగా పరిశీలించి పరిష్కరించాలని హెచ్చరించారు. దరఖాస్తుల పరిష్కారం పారదర్శకంగా ఉండాలని సూచించారు. దరఖాస్తుల పరిష్కారంలో అవసరమైతే క్షేత్రస్థాయిలో అటవీ, రెవెన్యూ అధికారుల ఆధ్వర్యంలో సంయుక్తంగా సర్వేలు చేయాలని తెలిపారు.

గ్రామాల్లో జరుగుతున్న రీ సర్వే ప్రక్రియను వేగవంతంగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ సమావేశంలో ఇంచార్జి అదనపు కలెక్టర్ (రెవెన్యూ) రాథోడ్ రమేష్, డీఎఫ్ఓ సుశాంత్ సుఖదేవ్ బోబడే, భైంసా సబ్ కలెక్టర్ అజ్మీరా సంకేత్ కుమార్, ఆర్డీవో దేవీదాస్, అటవీ, రెవెన్యూ అధికారులు పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>