కలం వెబ్ డెస్క్ : బళ్లారిలో (Ballari) గురువారం అర్ధరాత్రి గాలి జనార్ధన్ రెడ్డి (Gali Janardhan Reddy)పై హత్యాయత్నం జరగడం తీవ్ర కలకలం రేపింది. ఈ నేపథ్యంలో సిటీలో పోలీసులు 144 సెక్షన్ విధించారు. ఇరు వర్గాల గొడవల నేపథ్యంలో పోలీసులు అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు. ఎమ్మెల్యే నారా భరత్ రెడ్డి (Nara Bharat Reddy) అనుచరుడు సతీష్ రెడ్డి (Satish Reddy) గన్ మెన్ వద్ద ఉన్న తుపాకీతో జనార్ధన్ రెడ్డిపై కాల్పులు జరిపారు. జనార్ధన్ రెడ్డి ఈ ప్రమాదం నుంచి తృటిలో తప్పించుకున్నారు. ఈ సందర్భంగా గాలి జనార్ధన్ రెడ్డి భరత్ రెడ్డిపై తీవ్ర విమర్శలు చేశారు.
భరత్ బళ్లారిని (Ballari) బీహార్‌లా మార్చాడని విమర్శించారు. గత 30 ఏళ్లుగా ప్రశాంతంగా ఉన్న బళ్లారిని అక్రమాలకు నిలయంగా తయారు చేశాడన్నారు. నగరంలో భరత్ చేయని అక్రమాలు లేవని, ఫ్యాక్షన్ సినిమా తరహాలో వ్యవహరిస్తూ భరత్, ఆయన తండ్రి సూర్యనారాయణ రెడ్డి దుర్మార్గాలకు పాల్పడుతున్నారన్నారు. తనపై జరిగిన దాడిపై పోలీసులకు ఫిర్యాదు చేస్తానని వెల్లడించారు. తనను అటాక్ చేస్తే దేశవ్యాప్తంగా ఫేమస్ అవ్వొచ్చని భరత్ రెడ్డి ఇలా వ్యవహరించారని చెప్పారు.
Read Also: ప్రశ్నించడమా?.. పారిపోవడమా?
Follow Us On: Youtube


