కలం, మహబూబ్‌నగర్ బ్యూరో: మరణానంతరం మరో ఇద్దరికి చూపును ప్రసాదించే అద్భుత అవకాశం నేత్రదానం(Eye Donation) ద్వారా లభిస్తుందని మహబూబ్‌నగర్ (Mahabubnagar) రెడ్‌క్రాస్ చైర్మన్ లయన్ అంబటి నటరాజ్ అన్నారు. మహబూబ్‌నగర్‌కు చెందిన జక్కని చెన్నారెడ్డి (90) వయోభారంతో శనివారం మృతి చెందారు. ఆయన మరణానంతరం నేత్రాలను దానం చేయాలని కుటుంబ సభ్యులు నిర్ణయించారు. ఈ మేరకు ఆయన కుమారుడు జక్కని తిరుపతి రెడ్డి, నీరజతో పాటు కుటుంబ సభ్యులు డాక్టర్ లహరి, డాక్టర్ నిఖిల్, స్వప్న, మురళి రెడ్‌క్రాస్‌కు సమాచారం అందించారు.
సమాచారం అందుకున్న వెంటనే రెడ్‌క్రాస్ చైర్మన్ లయన్ అంబటి నటరాజ్, ఎల్‌వీ ప్రసాద్ కంటి ఆసుపత్రి టెక్నీషియన్ శివ స్పందించి కార్నియాలను సేకరించారు. అనంతరం కుటుంబ సభ్యులకు ధ్రువీకరణ పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా అంబటి నటరాజ్ మాట్లాడుతూ.. ఇప్పటి వరకు 277 మంది తమ కార్నియాలను దానం చేయగా, వాటి ద్వారా 554 మందికి చూపు కల్పించగలిగామని తెలిపారు. దుఃఖంలో ఉన్నప్పటికీ నేత్రదానానికి (Eye Donation) అంగీకరించిన జక్కని తిరుపతి రెడ్డి కుటుంబ సభ్యులకు లయన్ అంబటి నటరాజ్, రమణయ్య, గాజుల చంద్రయ్య, వెంకటయ్య, లయన్స్ క్లబ్ ఆఫ్ పాలమూరు తరఫున కృతజ్ఞతలు తెలిపారు. నేత్రదానం చేయాలనుకునే వారు రెడ్‌క్రాస్ చైర్మన్ లయన్ అంబటి నటరాజ్‌ను 9666900900 నంబర్‌లో సంప్రదించవచ్చని తెలిపారు.
Also Read : జ్ఞానేష్ కుమార్ రాజీనామాకు ప్రతిపక్షాల ఉద్యమం
Follow Us On : WhatsApp

