కరీంనగర్‌లో ‘శాతవాహన గ్రామీణ సంత’కు శ్రీకారం

కలం, కరీంనగర్: పర్యావరణ పరిరక్షణ, వ్యాధుల నివారణ, ఆరోగ్య సంరక్షణ లక్ష్యంగా ఈ నెల 28న కరీంనగర్‌లో (Karimnagar) గ్రామ భారతి ఆధ్వర్యంలో నిర్వహించనున్న ‘శాతవాహన గ్రామీణ సంత’(Satavahana Rural Market) వాల్ పోస్టర్‌ను మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ ప్రఫుల్ దేశాయ్ శనివారం ఆవిష్కరించారు. విషరహిత ఆహార ఉత్పత్తిదారులు, చేతివృత్తుల వారు, వినియోగదారుల మధ్య పరస్పర సహకారం పెంపొందించడమే లక్ష్యంగా ఈ సంతను నిర్వహిస్తున్నట్లు గ్రామ భారతి బాధ్యులు తెలిపారు. సెప్టెంబర్ 28న ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 7 గంటల వరకు కరీంనగర్ కలెక్టరేట్ ఎదురుగా ఉన్న రెవెన్యూ గార్డెన్‌లో సంత కొనసాగుతుందని పేర్కొన్నారు.

మొత్తం 60 స్టాళ్లను ఏర్పాటు చేయనున్నట్లు, సుమారు 1,200 మంది వినియోగదారులు పాల్గొనే అవకాశం ఉందని నిర్వాహకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో డీఈ వెంకటేశ్వర్లు, ఏఈ సతీష్‌తో పాటు శాతవాహన గ్రామీణ సంత రాష్ట్ర, జిల్లా కార్యకర్తలు జిన్నా సత్యనారాయణ రెడ్డి, రఘురాం రెడ్డి, నాల్యా మడుగుల శంకరయ్య, గాలిపెళ్లి నాగేశ్వరరావు, కూర్మాచలం మునీందర్, గొల్లే తిరుపతి, క్యాస మధు, సంపత్ తదితరులు పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>