కలం వెబ్ డెస్క్ : మాటల్లో వర్ణించలేని ఒక అందమన భావన ఫుల్‌మూన్(Full Moons). ప్రతి ఏడాది చాలా అరుదుగా కనిపించి మన మనసుల్ని ఆహ్లాదపరుస్తుంది. 2026 జనవరి ఆకాశం ఒక చిన్న మ్యాజిక్‌కు సిద్ధమవుతోంది. శీతాకాలపు తెల్లని పొగమంచులోంచి బయటకు తొంగిచూసే వోల్ఫ్ మూన్ పెద్దదిగా, ప్రకాశవంతంగా, మనపైకి మరింత దగ్గరగా వచ్చింది. ఇది పౌర్ణమి కాదు, ఆకాశం మనకిచ్చిన ఒక సూపర్ షో. నగరం మెలకువ కంటే ముందే, ఉదయం 5:03కి చంద్రుడు తన స్థాయిని ప్రూవ్ చేస్తూ ఆకాశాన్ని ఆక్రమించబోతున్నాడు. ఒకసారి తలపైకి చూసేసరికి ఇది సాధారణ చంద్రుడు కాదని, ఆకాశం కొంచెం దగ్గరికి వచ్చేసిందనిపిస్తుందంతే. ఇలాంటి ఫుల్ మూన్స్ ఈ ఏడాది 2026లో మొత్తం 13 కనిపించనున్నాయి.
2026లో తొలి ఫుల్ మూన్ జనవరి నెలలో కనిపిస్తుంది. జనవరి 3న శనివారం ఉదయం 5:03 ESTకు సంపూర్ణ పౌర్ణమి దశను చేరుకుంటుంది. ఈసారి పౌర్ణమి సంవత్సరంలో రెండో అత్యంత ఎత్తులో కనిపించే చంద్రునిగా నమోదవుతోంది. అంతేకాక, జనవరి 2, జనవరి 4 తేదీల్లో కూడా ఈ పౌర్ణమి తన సంపూర్ణ ప్రకాశంతో ఆకాశంలో దర్శనమిస్తుంది.
ఇది వరుసగా వచ్చిన నాలుగు సూపర్ మూన్‌లలో చివరిది. 2025వ సంవత్సరం అక్టోబర్‌లో హార్వెస్ట్ మూన్, నవంబర్‌లో బీవర్ మూన్, డిసెంబర్‌లో కోల్డ్ మూన్ తర్వాత జనవరి వుల్‍ఫ్ మూన్. సూపర్ మూన్ అనిపించడానికి కారణం, చంద్రుడు భూమికి అత్యంత దగ్గర స్థానమైన పెరిజీ వద్ద పౌర్ణమి దశలోకి రావడం. అందువల్ల ఇది సాధారణ పౌర్ణమితో పోలిస్తే మరింత పెద్దగా, ప్రకాశవంతంగా కనిపిస్తుంది. అదే సమయంలో, చంద్రుడు భూమికి దూరంగా ఉన్న అపోజీ సమయంలో కనిపించే పౌర్ణమిని “మైక్రో మూన్” అంటారు.
2026లో 13 పౌర్ణములు
2026లో మొత్తం 13 పౌర్ణములు కనిపించనున్నాయి. ఇందులో మూడు సూపర్ మూన్‌లు, రెండు చంద్రగ్రహణాలు ఉంటాయి. ముఖ్యంగా ఈ సంవత్సరం జరిగే సంపూర్ణ చంద్రగ్రహణం, 2028 నూతన సంవత్సరం రాత్రి వరకు ఉండే చివరి సంపూర్ణ గ్రహణంగా గుర్తింపు పొందుతోంది.
2026 పౌర్ణములు (Full Moons) ఇవే:
జనవరి 3: వోల్ఫ్ మూన్ — సూపర్ మూన్
ఫిబ్రవరి 1: స్నో మూన్
మార్చి 3: వర్మ్ మూన్ — సంపూర్ణ చంద్రగ్రహణం
ఏప్రిల్ 1: పింక్ మూన్
మే 1: ఫ్లవర్ మూన్
మే 31: బ్లూ మూన్
జూన్ 29: స్ట్రాబెర్రీ మూన్ — మైక్రో మూన్
జూలై 29: బక్ మూన్
ఆగస్ట్ 28: స్టర్జియన్ మూన్ — భాగిక చంద్రగ్రహణం
సెప్టెంబర్ 26: హార్వెస్ట్ మూన్
అక్టోబర్ 26: హంటర్‌స్ మూన్
నవంబర్ 24: బీవర్ మూన్ — సూపర్ మూన్
డిసెంబర్ 23: కోల్డ్ మూన్ — సూపర్ మూన్
2026లో చంద్రగ్రహణాలు
మార్చి 2-3:
సంపూర్ణ చంద్రగ్రహణం. చంద్రుడు భూమి నీడలోకి ప్రవేశించి సుమారు 58 నిమిషాల పాటు ఎర్రటి వర్ణంలో మెరుస్తూ “బ్లడ్ మూన్”గా కనిపిస్తాడు. ఉత్తర అమెరికా, ఆసియా-పసిఫిక్ ప్రాంతాల్లో ఈ గ్రహణం అత్యద్భుతంగా కనిపిస్తుంది.
ఆగస్ట్ 27-28:
భాగిక చంద్రగ్రహణం. చంద్రుడి 96% భాగం భూమి నీడలోకి ప్రవేశించి స్వల్ప ఎర్రటి వెలుగుతో కనిపిస్తుంది. దీనిని అమెరికా, యూరప్, ఆఫ్రికా ప్రాంతాల నుంచి స్పష్టంగా చూడొచ్చు.
చంద్ర దశలు ఎలా ఉంటాయి?
చంద్రుడు సుమారు 29.5 రోజుల్లో ఒక పూర్తి భ్రమణాన్ని పూర్తి చేస్తాడు. ఈ ప్రయాణంలో ఎనిమిది ప్రధాన దశలు ఉంటాయి. అమావాస్య సమయంలో చంద్రుడు భూమి, సూర్యుడి మధ్యకి వస్తాడు. దాని వల్ల చంద్రుడిలో చీకటి భాగం భూమివైపు ఉండి.. మనకు చంద్రుడు కనిపించడు. ఈ దశలోనే సూర్యగ్రహణం సంభవించే అవకాశం ఉంటుంది. 2026లో రెండు సూర్యగ్రహణాలు ఉండనున్నాయి. ఫిబ్రవరి 17న వలయాకార సూర్యగ్రహణం, ఆగస్ట్ 12న సంపూర్ణ సూర్యగ్రహణం ఉండనుంది.
ఆ తర్వాతి రోజుల్లో చంద్రుని వెలుగు నెమ్మదిగా పెరిగి శుక్ల పక్ష దశలు ప్రారంభమవుతాయి. శుక్ల చంద్రమాసం, మొదటి అర్ధచంద్రం, గిబ్బస్ దశ, ఆపై పౌర్ణమి. పౌర్ణమి తర్వాత కృష్ణ పక్ష దశలు మొదలై, చంద్రుడు తిరిగి తగ్గుముఖం పడతాడు. గిబ్బస్, చివరి అర్ధచంద్రం, క్రెసెంట్, చివరికి అమావాస్య. ఆపై మళ్లీ కొత్త చక్రం మొదలవుతుంది.
Read Also: మధ్యతరగతి వాళ్లు కూడా కోటీశ్వరులు కావొచ్చు.. ఎలా అంటే!
Follow Us On: X(Twitter)


