యువతిపై వేధింపులు: బిహార్‌లో మరో షాకింగ్ ఘటన!

కలం, వెబ్ డెస్క్ : జముయి, సమస్తిపూర్ ఘటనలు మరువకముందే బిహార్‌ (Bihar)లో మరో షాకింగ్ ఉదంతం వెలుగులోకి వచ్చింది. బాంకా జిల్లాలోని ప్రసిద్ధ పర్యాటక ప్రాంతమైన మందార్ హిల్‌(Mandar Hill)పై ఒక యువతిని ఆరుగురు ఆకతాయిలు వేధించి, దాడికి పాల్పడిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఖాకీ దుస్తుల పేరిట భయం లేకుండా కొందరు యువకులు ఈ దారుణానికి ఒడిగట్టినట్లు వీడియోను చూస్తే స్పష్టమవుతోంది.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మందార్ కొండ(Mandar Hill)ను సందర్శించేందుకు వచ్చిన ఒక యువతి పట్ల ఆరుగురు యువకులు నీచంగా ప్రవర్తించారు. ఆమెను చుట్టుముట్టి అశ్లీల సైగలు చేస్తూ, అసభ్యపదజాలంతో వేధించారు. అంతటితో ఆగకుండా బాధితురాలిపై చెప్పుతో దాడి చేసి భౌతిక దౌర్జన్యానికి పాల్పడ్డారు. ఈ క్రమంలో భయాందోళనకు గురైన సదరు యువతి వారి నుంచి తప్పించుకునేందుకు తీవ్రంగా ప్రయత్నించింది.

ఈ దృశ్యాలను అక్కడే ఉన్న కొందరు ఫోన్లలో చిత్రీకరించి నెట్టింట పోస్ట్ చేయడంతో విషయం వెలుగులోకి వచ్చింది. ఈ వీడియో వైరల్ కావడంతో స్థానికులు, నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సంఘటనపై తక్షణమే స్పందించిన బాంకా పోలీసులు కేసు నమోదు (FIR) చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. వీడియో ఆధారంగా నిందితులను గుర్తించి, వారిని పట్టుకోవడానికి ప్రత్యేక బృందాలను రంగంలోకి దించినట్లు అధికారులు వెల్లడించారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హామీ ఇచ్చారు.

Also Read : సిక్కింలో వరద బీభత్సం.. విరిగిపడిన కొండచరియలు

Follow Us On: X(Twitter)

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>