సుప్రీం కోర్టు తీర్పు.. దానం నాగేందర్ కీలక వ్యాఖ్యలు

కలం, వెబ్ డెస్క్: తనపై హైకోర్టు వేసిన అనర్హత వేటును సుప్రీంకోర్టు సమర్థించడంపై మాజీ ఎమ్మెల్యే దానం నాగేందర్ (Danam Nagender) స్పందించారు. తన పిటిషన్ పై ఇచ్చిన సుప్రీంకోర్టు తీర్పును స్వాగతిస్తున్నట్లు తెలిపారు. సికింద్రాబాద్ పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేసినప్పుడే ఊహించానని.. ఇప్పుడు అదే జరిగిందన్నారు. లీగల్ గా పోరాటం చేయడంలో తప్పు లేదని.. అందుకే తాను సుప్రీం కోర్టును ఆశ్రయించినట్లు చెప్పారు. సుప్రీంకోర్టు మళ్ళీ ఎన్నికల్లో పోటీ చేసుకోమని చెప్పిందన్నారు. 10వ షెడ్యూల్ ప్రకారం తమకు ఊరట కలుగుతుందని భావించామని.. కానీ అలా జరుగలేదని చెప్పారు.

మళ్ళీ పోటీ చేస్తా..

తాను ప్రజల సమస్యలలో నిరంతరం పోరాటం చేసిన వ్యక్తిని అని.. మళ్ళీ ప్రజల మధ్యకు వచ్చి పోటీ చేస్తానని దానం నాగేందర్ అన్నారు. నియోజకవర్గానికి పరిమితమై పని చేస్తానని చెప్పారు. ఎన్నికలషెడ్యుల్ వచ్చిన తరువాత ఏ పార్టీ నుండి పోటీ చేయాలో తర్వాత నిర్ణయం తీసుకుంటానని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని స్కీములు అమలు చేస్తోందని.. సీఎం రేవంత్ రెడ్డి 24 గంటలు కష్టపడి పని చేస్తున్నారని అన్నారు. డైనమిక్ సీఎం రేవంత్ రెడ్డితో అభివృద్ధి జరుగుతుందని ప్రజలు అనుకుంటున్నారని చెప్పారు.

నాకు ప్రజా బలం ఉంది..

ఖైరతాబాద్‌లో తనకు ప్రజా బలం ఉందని.. నియోజకవర్గ ప్రజలు తనను కుటుంబ సభ్యుడిగా భావిస్తారని దానం చెప్పుకొచ్చారు. తనకు ప్రజలు ముఖ్యమని.. ప్రజల కోసం పని చేస్తానని అన్నారు. అజిజ్ నగర్ ఉప ఎన్నికల్లో ఓటమి తర్వాత తనకు ప్రమోషన్ వచ్చిందని అన్నారు. సికింద్రాబాద్ పార్లమెంట్ ఎన్నికల్లో కిషన్ రెడ్డికి చెమటలు పట్టించానని ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఖైరతాబాద్ నియోజకవర్గంలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేశానని అన్నారు. తమ నియోజకవర్గంలో 10వేల ఇండ్లు కట్టడానికి స్థలం ఉందని.. కానీ 280 మంది మాత్రమే అప్లై చేసుకున్నారని చెప్పారు. మిగతా వాళ్లంతా బయట నుండే అప్లై చేసుకున్నారని అన్నారు.

బీఆర్ఎస్ బిగ్ ఫైట్..

బీఆర్ఎస్ పార్టీ నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన దానం నాగేందర్.. సికింద్రాబాద్ ఎంపీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేశారు. దీనిపై తీవ్ర ఆగ్రహానికి గురైన బీఆర్ఎస్ పార్టీ.. అతని ఎమ్మెల్యే పదవిని రద్దు చేయాలని న్యాయస్థానాలను ఆశ్రయించడంతో దానం నాగేందర్ పై అనర్హత వేటు పడింది. తొలుత హైకోర్టు అనర్హత వేటు వేయగా.. దానం సుప్రీం కోర్టును ఆశ్రయించారు. అక్కడ కూడా ఆయనకు చేదు అనుభవమే ఎదురైంది.

Also Read: లోపం లేకున్నా.. దివ్యాంగులే: ముడుపుల మాయలో ‘సదరం’!

Follow Us On: X(Twitter)

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>