భారత్-బంగ్లాదేశ్ సరిహద్దులో సైనికుల దీపావళి సంబరాలు

కలం, వెబ్ డెస్క్: దేశవ్యాప్తంగా దీపావళి వేడుకలు ఘనంగా జరిగాయి. సరిహద్దుల్లో భారత్ రక్షణ కోసం నిరంతరం గస్తీకాసే ఇండియన్ ఆర్మీ (Indian Army) కూడా సంబరాల్లో పాల్గొంది. భారత్-బంగ్లాదేశ్ అంతర్జాతీయ సరిహద్దులో సరిహద్దు భద్రతా దళం (BSF) జవాన్లు సరిహద్దులోని పలు ప్రాంతాల్లో దీపావళి పండుగను సంప్రదాయబద్ధంగా జరుపుకున్నారు.

ఈ సందర్భంగా భద్రతా దళాలు దీపాలు వెలిగించి పండుగ సంబరాల్లో పాల్గొన్నారు. ఒకరికొకరు స్వీట్లు పంచుకుంటూ దీపావళి శుభాకాంక్షలు తెలియజేసుకున్నారు. విధి నిర్వహణలో ఉన్నప్పటికీ పండుగను ఆనందంగా జరుపుకుంటూ ఐక్యత, సోదరభావం, దేశభక్తిని చాటారు. మరోవైపు, భారత్-పాకిస్థాన్ సరిహద్దుల్లో కూడా సైనికులు దీపావళి వేడుకలు జరుపుకున్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>