కలం, వలిగొండ: వినాయక చవితి పర్వదినాన్ని పురస్కరించుకొని భక్తులు ఏర్పాటు చేసిన గణేశుని మండపాల వద్ద పూజలు అందుకున్న గణనాథులు క్రమక్రమంగా గంగమ్మ ఒడికి చేరుతున్నారు. వలిగొండ (Valigonda) మండలంలో వినాయక నిమజ్జనం ఎటువంటి డీజే మొతలు లేకుండా స్థానిక ఎస్సై శ్రీకాంత్ రెడ్డి చొరవతో ప్రశాంతంగా కొనసాగుతుంది. డీజే మొతలు లేకపోవడం బ్యాండ్ బాజాలతో నిమజ్జనానికి గణనాథులను తరలిస్తుండడంతో జనం హర్షం వ్యక్తం చేస్తున్నారు.

