కొడంగల్ లో సీఎం రేవంత్ బిజీ బిజీ.. నేటి షెడ్యూల్ ఇదే!

కలం, వెబ్ డెస్క్ : తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి (Revanth Reddy) తన సొంత నియోజకవర్గమైన కొడంగల్‌లో పర్యటిస్తున్న సంగతి తెలిసిందే. మూడు రోజుల పర్యటనలో భాగంగా కొడంగల్ నియోజకవర్గంలో సుమారు రూ.9,000 కోట్లకు పైగా విలువైన పలు సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలకు సీఎం రేవంత్ రెడ్డి శ్రీకారం చుట్టారు. పర్యటనలో చివరి రోజైన నేడు మధ్యాహ్నం లగచర్ల ఇండస్ట్రియల్ పార్క్‌లో రూ.81 కోట్ల అంచనా వ్యయంతో ఏర్పాటు చేయనున్న ఎకోపామ్ ఆయిల్ ఫామ్ (పామాయిల్) ప్రాసెసింగ్ ఫ్యాక్టరీ నిర్మాణానికి సీఎం శంకుస్థాపన చేయనున్నారు. ఈ ప్రాజెక్ట్ ద్వారా స్థానిక యువతకు ఉపాధి అవకాశాలు పెరగడంతో పాటు, ప్రాంతీయ పారిశ్రామిక ప్రగతికి ఊతం లభిస్తుందని అధికారులు తెలిపారు.

ఆ తర్వాత, రూ.5,060 కోట్ల అంచనా వ్యయంతో నిర్మించనున్న కీలకమైన రేడియల్ రోడ్డు-2 నిర్మాణ పనులకు సీఎం రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేస్తారు. ఈ కనెక్టివిటీ రోడ్డు ద్వారా కొడంగల్ ప్రాంతానికి రవాణా సదుపాయాలు మెరుగై, పారిశ్రామిక కారిడార్‌కు సత్వర మార్గం సుగమం కానుంది. పర్యటన ముగింపుగా సాయంత్రం 5 గంటలకు దుద్యాల మండలం హకీంపేటలో నిర్వహిస్తున్న మెగా ‘రైతు మేళా’ ముగింపు వేడుకలు, భారీ బహిరంగ సభలో సీఎం పాల్గొననున్నారు. ఈ సందర్భంగా రైతులను ఉద్దేశించి సీఎం రేవంత్ రెడ్డి కీలక ప్రసంగం చేయనున్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>