గవర్నర్‌ను కలిసిన జగన్.. కీలక అంశాలపై ఫిర్యాదు

కలం, వెబ్ డెస్క్ : ఆంధ్రప్రదేశ్ గవర్నర్ ను వైసీపీ అధినేత వైఎస్ జగన్ (YS Jagan) కలిశారు. బుధవారం విజయవాడలోని లోక్‌భవన్‌లో గవర్నర్ అబ్దుల్ నజీర్‌ (Governor Abdul Nazeer) తో ఆయన భేటీ అయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్రంలోని పలు అంశాలను గవర్నర్ దృష్టికి తీసుకెళ్లినట్లు సమచారం.

శాప్ కార్యాలయం ఎదుట వైస్సార్సీపీ పార్టీ నేతలపై టీడీపీ కార్యకర్తలు దాడి చేశారని ఆరోపిస్తూ గవర్నర్‌కు జగన్ ఫిర్యాదు చేశారు. అలాగే డీఎస్సీ నియామకాల్లో అక్రమాలు జరిగాయని ఆరోపించిన జగన్.. ఈ వ్యవహారంపై సీబీఐతో విచారణ జరిపించాలని గవర్నర్‌కు విజ్ఞప్తి చేశారు. రాష్ట్రంలో నెలకొన్న పలు రాజకీయ, పరిపాలనా అంశాలపై కూడా గవర్నర్‌తో జగన్ చర్చించినట్లు తెలుస్తోంది.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>