కలం, వెబ్ డెస్క్ : ఆంధ్రప్రదేశ్ గవర్నర్ ను వైసీపీ అధినేత వైఎస్ జగన్ (YS Jagan) కలిశారు. బుధవారం విజయవాడలోని లోక్‌భవన్‌లో గవర్నర్ అబ్దుల్ నజీర్ (Governor Abdul Nazeer) తో ఆయన భేటీ అయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్రంలోని పలు అంశాలను గవర్నర్ దృష్టికి తీసుకెళ్లినట్లు సమచారం.
శాప్ కార్యాలయం ఎదుట వైస్సార్సీపీ పార్టీ నేతలపై టీడీపీ కార్యకర్తలు దాడి చేశారని ఆరోపిస్తూ గవర్నర్‌కు జగన్ ఫిర్యాదు చేశారు. అలాగే డీఎస్సీ నియామకాల్లో అక్రమాలు జరిగాయని ఆరోపించిన జగన్.. ఈ వ్యవహారంపై సీబీఐతో విచారణ జరిపించాలని గవర్నర్‌కు విజ్ఞప్తి చేశారు. రాష్ట్రంలో నెలకొన్న పలు రాజకీయ, పరిపాలనా అంశాలపై కూడా గవర్నర్‌తో జగన్ చర్చించినట్లు తెలుస్తోంది.

