‘యుద్ధం చేయండి’.. క్యాడర్​ కు జగన్​ కీలక ఆదేశాలు

కలం, వెబ్​ డెస్క్​ : ఆంధ్రప్రదేశ్​ లో రాబోయే మున్సిపల్​ ఎన్నికల (Municipal Elections) నేపథ్యంలో వైసీపీ అధినేత వైఎస్​ జగన్ (YS Jagan)​ పార్టీ కార్యకర్తలకు కీలక ఆదేశాలు జారీ చేశారు. ఎన్నికల్లో విజయం సాధించేందుకు యుద్ధం చేయాలని.. దానికి తాను అండగా ఉంటానని ఆయన స్పష్టం చేశారు. జగన్​ 2.O లో కార్యకర్తే నెంబర్ వన్​ అని జగన్​ స్పష్టం చేశారు. ‘అన్యాయం చేస్తున్న పోలీసు వాళ్లందరికీ సినిమా ఎలా చూపించాలో మనం చూపిస్తాం’ అని వైసీపీ చీఫ్​ చెప్పుకొచ్చారు.

అన్యాయం చేసే పోలీసులను గుర్తుంచుకుని వారి పేర్లను వెంటనే డిజిటల్​ లైబ్రరీలోకి ఎక్కించాలని కార్యకర్తలకు జగన్​ సూచించారు. వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత అన్ని లెక్కలూ తీస్తాం అని ఆయన (YS Jagan)​ హెచ్చరించారు. అబద్ధాలను ప్రచారం చేయడంలో చంద్రబాబు నాయుడు, ఎల్లో మీడియాలను మించిన వాళ్లు లేరని ఆరోపించారు. లింగులుటుకులు అంటూ అబద్దాలు ప్రచారం చేస్తున్నాయని విమర్శించారు. ఆంధ్రప్రదేశ్​ లో కరువు ఉంటే ప్రజలంతా సంతోషంగా కేరింతలు కొడుతున్నారని ప్రచారం చేస్తున్నాయని పలు మీడియా సంస్థలపై మాజీ సీఎం జగన్​ ధ్వజమెత్తారు.

Also Read : సాయికృష్ణ కేసు విచారణపై సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు

Follow Us On: X(Twitter)

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>