కలం, వెబ్ డెస్క్: కేసీఆర్ హయాంలో రైతులకు 24 గంటలు కరెంట్ ఇచ్చామని.. ఇప్పుడు రేవంత్ రెడ్డి పాలనలో రాష్ట్రవ్యాప్తంగా కరెంట్ కోతలున్నాయని మాజీ మంత్రి కేటీఆర్ (KTR) ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ఉంటే కరెంట్ ఉండదని తాము ముందే చెప్పామని గుర్తు చేశారు. కాంగ్రెస్ కావాలా కరెంట్ కావాలా అని ఎన్నికల సమయంలో అడిగామన్నారు. తాము చెప్పిందే ఇప్పుడు యధాతథంగా జరుగుతుందని విమర్శించారు. రాష్ట్రంలో గ్రాస్ మిస్ మ్యానేజ్ మెంట్ ఆఫ్ రిసోర్సెస్, గ్రాస్ మిస్ మ్యానేజ్ మెంట్ ఆఫ్ ఫైనాన్సెస్ జరుగుతుందన్నారు..
బొగ్గు నిల్వలు లేకవారం రోజుల్లో ఐదు పవర్ జనరేషన్ యూనిట్లు బంద్ అయ్యాయని కేటీఆర్ (KTR) మండిపడ్డారు.తాము కొన్ని రోజుల క్రితమే సింగరేణిలో 40 లక్షల టన్నుల బొగ్గు మాయమైందని, రూ. 1600 కోట్ల కుంభకోణం జరిగిందని బయటపెట్టామని చెప్పారు. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఏమో బొగ్గు ఉందని అంటున్నారని.. బొగ్గు నిజంగానే ఉంటే కోల్ నిల్వలు నిల్ అని వార్తలు ఎందుకు వస్తున్నాయి? అని ప్రశ్నించారు. పవర్ జనరేషన్ యూనిట్లు ఎందుకు బంద్ అయ్యాయని నిలదీశారు.
థర్డ్ గ్రేడ్ బొగ్గు వాడటం వల్ల రాష్ట్రానికి రూ.2900 కోట్ల నష్టం జరిగిందని కేటీఆర్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. సోషల్ మీడియాలో 1980 ట్రెండ్ నడుస్తుందని ఎద్దేవా చేశారు.. రాష్ట్రంలో 1980 రోజుల్లో కరెంట్ కోతలతో రైతులు అవస్థలు పడినట్లు ఇప్పుడు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని విమర్శించారు.
Also Read : కేటీఆర్కు రేవంత్ చెక్.. సిరిసిల్లలో కాంగ్రెస్ స్కెచ్!
Follow Us On : WhatsApp

