‘ది ప్యారడైజ్’ అడ్వాన్స్ బుకింగ్స్ ఎన్ని కోట్లంటే!

కలం, వెబ్ డెస్క్ : నేచురల్ స్టార్ నాని కథానాయకుడిగా తెరకెక్కిన మోస్ట్ ఎవైటెడ్ చిత్రం ‘ది ప్యారడైజ్’ (The Paradise) బాక్సాఫీస్ వద్ద భారీ హంగామా సృష్టిస్తోంది. రెండు తెలుగు రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్, తెలంగాణల్లో ఈ సినిమా అడ్వాన్స్ బుకింగ్స్‌లో మునుపెన్నడూ లేని రీతిలో రికార్డు కలెక్షన్లు కొల్లగొడుతోంది.

ప్రీమియర్ షోలు, మొదటి రోజు అడ్వాన్స్ సేల్స్ రెండింటినీ పరిగణనలోకి తీసుకుంటే, కేవలం ఏపీ, తెలంగాణల నుంచే ఇప్పటివరకు ఏకంగా రూ.22.69 కోట్ల గ్రాస్ వసూళ్లు నమోదు కావడం విశేషం. రీజియన్ల వారీగా చూస్తే, తెలంగాణ బాక్సాఫీస్ వద్ద రూ.14.05 కోట్లు దక్కగా (ఇందులో ఒక్క హైదరాబాద్ నగరం నుంచే రూ.11.40 కోట్లు వసూలయ్యాయి), ఆంధ్రప్రదేశ్ నుంచి రూ.8.64 కోట్ల గ్రాస్ వచ్చింది.

మిగతా ఏరియాలలో కూడా కలెక్షన్ల ప్రవాహం కొనసాగుతోంది. వైజాగ్ లో రూ.2.35 కోట్లు, సీడెడ్ లో రూ.1.49 కోట్లు, ఈస్ట్ గోదావరిలో రూ.1.28 కోట్లు, గుంటూరులో రూ.1.19 కోట్లు, కృష్ణా జిల్లాలో రూ.1.09 కోట్లు వసూలవ్వగా, వెస్ట్ గోదావరిలో రూ.69.98 లక్షలు, నెల్లూరులో రూ.55.42 లక్షల గ్రాస్ నమోదైంది. థియేటర్లలో విడుదల కాకముందే ఈ స్థాయిలో టికెట్లు అమ్ముడవుతుండటంతో, ‘ది ప్యారడైజ్ (The Paradise)’ చిత్రం తొలిరోజే సరికొత్త రికార్డులు క్రియేట్ చేయడం ఖాయంగా కనిపిస్తోంది.

Also Read : బ్లడ్ బ్యాంకుపై ఆరోపణలు.. చిరంజీవి సీరియస్

Follow Us On : WhatsApp

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>