కలం, ఖమ్మం బ్యూరో : భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి ఆలయ (Bhadrachalam Temple) పునరుద్ధరణ, అభివృద్ధి పనులపై రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణ, సమాచార-పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి (Minister Ponguleti) ప్రత్యేక దృష్టి సారించారు. రాబోయే శ్రీరామనవమి, గోదావరి పుష్కరాలను దృష్టిలో ఉంచుకుని ప్రధాన పనులన్నీ గడువులోగా పూర్తయ్యేలా ‘రివర్స్ ప్లానింగ్’ ఆధారంగా వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. బుధవారం భద్రాచలం చేరుకున్న మంత్రి, మొదట రామయ్యను దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.
అనంతరం ప్రజాప్రతినిధులు, జిల్లా అధికారులతో కలసి ఆలయ ప్రాంగణంలో జరుగుతున్న దమ్మక్క విగ్రహం పరిసరాలు, రాతి పనులు, నిర్మాణ పురోగతిని క్షేత్రస్థాయిలో ప్రత్యక్షంగా పరిశీలించారు. అనంతరం సబ్ కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించిన ఉన్నత స్థాయి సమీక్షలో మంత్రి (Minister Ponguleti Srinivas Reddy) మాట్లాడుతూ.. ప్రభుత్వం ఆలయాభివృద్ధికి రూ.275 కోట్లు కేటాయించిందని, నాణ్యతతో పాటు ఆగమ శాస్త్ర సాంప్రదాయాలకు కట్టుబడి పనులు జరగాలని స్పష్టం చేశారు.
ప్రతీ 3 రోజులకు ఒక లిఫ్ట్ పని పూర్తి కావాలని, అవసరమైన బూమ్ పంపులు, ఆధునిక సాంకేతిక పరికరాలు వినియోగించి శ్రామిక శక్తిని పెంచాలని సూచించారు. అలాగే రాతి పనులపై ప్రత్యేక శ్రద్ధ పెట్టి రోజువారీ లక్ష్యాలను (డైలీ టార్గెట్స్) పూర్తి చేయాలని ఆదేశించారు. ఆలయ (Bhadrachalam Temple) పరిసర రహదారుల కనెక్టివిటీ కోసం రూ.25 కోట్ల ప్రతిపాదనలను త్వరలోనే మంజూరు చేస్తామని తెలిపారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆకాంక్ష మేరకు భద్రాద్రికి వచ్చే భక్తులకు అత్యుత్తమ వసతులు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పేర్కొన్నారు.
Also Read : సర్‌పై ఎన్నికల కమిషనర్ల అభ్యంతరాలు?.. ఈసీ వివరణ
Follow Us On: X(Twitter)

