కొత్తపల్లి వద్ద గణేష్​ నిమజ్జనం షురూ.. తొలి విగ్రహానికి మేయర్ శ్రీనివాస్ ప్రత్యేక పూజలు

కలం, కరీంనగర్ బ్యూరో: కరీంనగర్ (Karimnagar) పట్టణంలో గత తొమ్మిది రోజులుగా భక్తుల పూజలు, భజనలు, విశేష అభిషేకాలందుకున్న లంబోదరుడు గంగమ్మ ఒడికి చేరేందుకు సిద్ధమయ్యాడు. కరీంనగర్ నగరపాలక సంస్థ పరిధిలో గణేష్ నిమజ్జన (Ganesh Immersion) ఉత్సవాలు బుధవారం అత్యంత వైభవంగా, ఆధ్యాత్మిక వాతావరణంలో ప్రారంభమయ్యాయి.

నిమజ్జనం పాయింట్ ప్రారంభించిన మేయర్ శ్రీనివాస్

నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా కొత్తపల్లి వద్ద ఏర్పాటు చేసిన నూతన నిమజ్జనం పాయింట్ వద్ద విగ్రహాల నిమజ్జన ప్రక్రియ శోభాయమానంగా మొదలైంది. ఈ కార్యక్రమాన్ని కరీంనగర్ నగర మేయర్ కొలగాని శ్రీనివాస్ (Mayor Kolagani Srinivas) లాంఛనంగా ప్రారంభించారు. కొత్తపల్లి పాయింట్‌కు తరలివచ్చిన మొట్ట మొదటి వినాయక విగ్రహానికి మేయర్ కొలగాని శ్రీనివాస్ ప్రత్యేక పూజలు చేసి, క్రేన్ సహాయంతో విగ్రహాన్ని నిమజ్జనం చేసి, విగ్నేశ్వరుడికి భక్తిశ్రద్ధలతో వీడ్కోలు పలికారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>