కలం వెబ్ డెస్క్ : ఇటీవల హిందూ దేవుళ్లపై అనుచిత వ్యాఖ్యలు చేసిన ప్రముఖ యూట్యూబర్ అన్వేష్‌కు (YouTuber Anvesh) పోలీసులు షాకిచ్చారు. ఆయనపై నమోదైన కేసుల్లో దర్యాప్తు ప్రారంభించారు. ఇన్‌స్టాగ్రామ్‌కు (Instagram) పంజాగుట్ట పోలీసులు ఓ లేఖ రాశారు. లేఖలో అన్వేష్ ఇన్‌స్టా ఖాతా వివరాలు కోరారు. అన్వేష్ విదేశాల్లో పర్యటిస్తూ ప్రపంచ యాత్రికుడిగా ఫేమస్ అయ్యాడు. ఈయనకు సోషల్ మీడియాలో లక్షల్లో ఫాలోవర్లు ఉన్నారు.
స్త్రీల వస్త్రధారణపై ఇటీవల టాలీవుడ్‌లో చెలరేగిన వివాదంతో అన్వేష్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. హిందూ దేవుళ్లు, ప్రవచనకర్తలపై అసభ్య పదజాలంతో విరుచుకుపడ్డాడు. దీనిపై హిందూ సంఘాలు, పలువురు వ్యక్తులు రాష్ట్ర వ్యాప్తంగా ఫిర్యాదులు చేశారు. ఈ నేపథ్యంలో పోలీసులు దర్యాప్తు చేపట్టారు. అన్వేష్ సోషల్ మీడియా ఖాతాలు బ్యాన్ చేయాలని డిమాండ్లు వెల్లువెత్తుతున్నాయి. పోలీసులు ఇన్‌స్టాగ్రామ్‌కు లేఖ రాయడంతో అన్వేష్‌పై (YouTuber Anvesh) ఎలాంటి చర్యలు తీసుకుంటారన్నది ఆసక్తికరంగా మారింది.
Read Also: బెట్టింగ్ యాప్స్‌కు మరో యువకుడు బలి
Follow Us On: Pinterest


