కలం వెబ్ డెస్క్ : దేశంలోని పలు నగరాలను పొగమంచు(Fog) కమ్మేసింది. దీంతో విమానాల రాకపోకలు ఆలస్యమవుతున్నాయి. వారణాసి, ఉదయ్‌పూర్, జమ్మూ, విశాఖపట్నం, జైసల్మేర్, హైదరాబాద్(Hyderabad), గువాహటి నగరాలకు వెళ్లే, వచ్చే విమానాలు ఆలస్యమవుతున్నట్లు ప్రముఖ విమానయాన సంస్థ ఇండిగో(Indigo) తెలిపింది. పొగమంచు కారణంగా తక్కువ విజిబిలిటీ ఏర్పడటంతో విమానాలు నెమ్మదిగా కదులుతున్నాయి. ఈ నగరాలతో పాటు దేశవ్యాప్తంగా కొన్ని రూట్లలోనూ విమానాల రాకపోకల్లో ఆలస్యం జరుగుతోంది. వాతావరణం మెరుగుపడే వరకు ఈ పరిస్థితి కొనసాగవచ్చని అధికారులు చెబుతున్నారు. విమానాశ్రయాల్లో సహాయక బృందాలు ప్రయాణికులకు అందుబాటులో ఉన్నట్లు ఇండిగో వెల్లడించింది. అధికారులతో సమన్వయంతో వీలైనంత త్వరగా సాధారణ స్థితికి చేరుకోవడానికి ప్రయత్నిస్తున్నట్లు పేర్కొంది. ప్రయాణికులు తమ ఫ్లైట్ స్టేటస్‌ను వెబ్‌సైట్ లేదా యాప్ ద్వారా తప్పనిసరిగా చెక్ చేసుకోవాలని ఎక్స్ వేదికగా సూచించింది.
మరోవైపు పొగమంచు కారణంగా శంషాబాద్(Shamshabad) ఎయిర్ పోర్టులో పలు విమానాలు రద్దయ్యాయి. ఢిల్లీ(Delhi) నుంచి శంషాబాద్ రావాల్సిన, శంషాబాద్ నుంచి ఢిల్లీకి వెళ్లాల్సిన ఎయిర్ ఇండియా(Air India) విమానం రద్దయ్యింది. శంషాబాద్ ఎయిర్ పోర్టు నుంచి తిరుపతికి వెళ్లాల్సిన, తిరుపతి నుంచి శంషాబాద్ రావాల్సిన ఇండిగో విమానం ఆలస్యం కానున్నట్లు అధికారులు వెల్లడించారు. రాజేంద్ర నగర్, శంషాబాాద్ ప్రాంతాలను పొగమంచు కమ్మేసింది. దీంతో రోడ్లపై వాహనదారులకు సైతం రాకపోకలకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. పొగమంచు ప్రభావంతో బెంగళూర్, హైదరాబాద్ హైవేపై సుమారు 10 కిలో మీటర్ల మేర ట్రాఫిక్ జామ్ అయ్యింది.


