కలం, ఖమ్మం బ్యూరో : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కరకగూడెం (Karakagudem) మండలం అశ్వాపురంపాడు (Aswapurampadu) ఫారెస్ట్ ప్లాంటేషన్ వద్ద జరిగిన హత్యాయత్నం కేసు మిస్టరీని పోలీసులు చేధించారు. ఈ నెల 19న పశువులు మేపుతున్న వజ్జా భీమరాజుపై కత్తులతో దాడి చేసిన ఘటనకు కారణం పాతకక్షలే అని దర్యాప్తులో తేలింది. గతంలో గ్రామ పెద్ద వెంకటేశ్వర్లు హత్యకు భీమరాజే కారణమనే కోపంతో, జైలు నుంచి విడుదలైన వెంకటేశ్వర్లుతో కలిసి నిందితులు ఈ దాడికి పథకం వేశారు. ఈ కేసులో కోవాసి బాలకృష్ణ, పోడియం విజయ్, కోవాసి సంతోష్, పోడియం మంగయ్యలను మంగళవారం అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించినట్లు సీఐ వెంకటేశ్వరరావు, ఎస్సై పి.వి.ఎన్.రావు మీడియాకు తెలిపారు.
Also Read : వరంగల్ ఎయిర్‌పోర్టు పేరుపై అసదుద్దీన్ లేఖ
Follow Us On : WhatsApp

