కలం, వెబ్ డెస్క్: ప్రజల అభిరుచులు, ఆలోచనలు మారుతున్నాయి. అందుకు తగ్గట్టుగానే రైల్వే డిపార్ట్మెంట్ సకల సౌకర్యాలను కల్పిస్తోంది. ఇప్పటికే వందే భారత్ లాంటి రైళ్లు (Trains) ప్రయాణికులకు చాలా దగ్గరయ్యాయి. అలాగే విలాసవంతమైన అత్యాధునిక రైళ్లు ఆకర్షిస్తున్నాయి. ఈ క్రమంలో ‘ప్యాలెస్ ఆన్ వీల్స్’ టూరిజం సరికొత్త అనుభవాలను అందిస్తున్నాయి. ఈ తరహా రైలు (India Luxury Train)లో ప్రయాణించాలంటే 7 రోజుల ప్రయాణానికి రూ.21 లక్షలకుపైగా చెల్లించాల్సి ఉంటుంది. ఇది కదిలే ప్యాలెస్‌లా ఉంటుంది.
జైపూర్‌లోని దుర్గాపుర స్టేషన్‌లోని ప్యాలెస్ ఆన్ వీల్స్ రైలును దూరం నుంచే చూస్తే ఆశ్చర్యపోవడం ఖాయం. అచ్చం పాతకాలం నాటి ప్యాలెస్‌లు (Palace) కళ్ల ముందు కదలాడుతాయి. రైలులోకి అడుగు పెట్టగానే ఎర్రటి తలపాగాలు ధరించిన సిబ్బంది సాంప్రదాయ దుస్తుల్లో స్వాగతం పలుకుతారు. రైలులోకి ప్రవేశించిన వెంటనే షీష్ మహల్ రెస్టారెంట్ ఉంటుంది. టేబుళ్లు స్పూన్లు, ఫోర్కులు వెండి పూతతో ఉంటాయి. ఇక్కడ అదిరిపోయే రుచులను ఆస్వాదించవచ్చు. అలాగే విశ్రాంతి గదుల్లో హాయిగా సేద తీరవచ్చు.
రాజభవంతులను తలపించే గదులు ప్రత్యేకంగా ఆకట్టుకుంటాయి. వెండి మంచం, పెద్ద సోఫా, రాయల్ ఇంటీరియర్స్ రా రామ్మని పిలుస్తాయి. ఇలాంటి తరహా రైళ్లు అందుబాటులోకి రావడంతో ధనవంతులు ఎక్కువగా ప్రయాణిస్తున్నారు. సకల సౌకర్యాలు ఉండటంతో అందులోనే పెళ్లిలు చేసుకుంటున్నారు. జైపాల్ నుంచి ఢిల్లీ (Delhi) వెళ్లే క్రమంలో అనేక పర్యాటక ప్రాంతాలను చూసేస్తున్నారు. ఈ క్రమంలో హనీమూన్ తంతు కూడా పూర్తవుతుంది. ఇలా అనుభూతులను అందిస్తుంది ఈ ట్రైన్.


