కలం, వెబ్ డెస్క్: హైదరాబాద్‌లోని విలువైన భూములు, అక్రమ కట్టడాలపై హైడ్రా దృష్టి సారిస్తున్న విషయం తెలిసిందే. ఒకవైపు కూల్చివేతలు కొనసాగిస్తూనే.. మరోవైపు అక్రమాలకు పాల్పడేవారిని సైతం వదిలిపెట్టడం లేదు. ఈ నేపథ్యంలో హైడ్రా (Hydra) బీఆర్ఎస్ నేతకు షాక్ ఇచ్చింది. దుర్గం చెరువులో మట్టి, రాళ్లు నింపి అక్రమంగా ప్రైవేటు పార్కింగ్ దందాను గుర్తించిన హైడ్రా మాదాపూర్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న కొత్త ప్రభాకర్ రెడ్డితోపాటు వెంకటరెడ్డిపై కేసు నమోదైంది.
2014లో దుర్గం చెరువులో సుమారు 5 ఎకరాల్లో మట్టిని అక్రమంగా తరలించి వాణిజ్యంగా ఉపయోగిస్తున్నట్లుగా కొత్త ప్రభాకర్ రెడ్డి (Kotha Prabhakar Reddy) తోపాటు మరికొందరిపై ఆరోపణలు వచ్చాయి. దీంతో రంగంలోకి దిగిన హైడ్రా చెరువుకు ముప్పు కలుగుతుందని గుర్తించింది. అందుకు సంబంధించిన వివరాలతో సహ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది.


