ఆస్ప‌త్రుల‌పై చ‌ర్య‌ల విష‌యంలో మంత్రి విఫలం: ఏఐవైఎఫ్

కలం, కరీంనగర్: కరీంనగర్ జిల్లాలో ఎలాంటి అనుమతులు, నిబంధనలు పాటించకుండా నిర్వహిస్తున్న ప్రైవేట్ ఆసుపత్రులపై చర్యలు తీసుకోవడంలో వైద్యశాఖ మంత్రి, జిల్లా వైద్యాధికారులు పూర్తిగా విఫలమయ్యారని అఖిల భారత యువజన సమాఖ్య (AIYF) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ మేరకు ఏఐవైఎఫ్ జిల్లా అధ్యక్షుడు పోలోజు రంజిత్, ప్రధాన కార్యదర్శి బ్రాహ్మణపల్లి యుగంధర్ ఒక ఉమ్మడి ప్రకటన విడుదల చేశారు. ​ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ… కరీంనగర్ నగరంతో పాటు జిల్లావ్యాప్తంగా పలు ప్రైవేట్ ఆసుపత్రులు ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా అవసరమైన క్లినికల్ ఎస్టాబ్లిష్‌మెంట్ రిజిస్ట్రేషన్లు, అనుమతులు లేకుండానే అక్రమంగా నడుస్తున్నాయని ఆరోపించారు. వైద్యశాఖపై మంత్రికి కనీస పట్టు లేకపోవడం వల్లనే ప్రైవేట్ ఆసుపత్రులు విచ్చలవిడిగా ప్రవర్తిస్తున్నాయని విమర్శించారు.

మంత్రిగా బాధ్యతలు చేపట్టినప్పటి నుండి ఇప్పటి వరకు కరీంనగర్ జిల్లాకు రాకపోవడం శోచనీయమని పేర్కొన్నారు. జిల్లాలోని అన్ని ప్రైవేట్ ఆసుపత్రుల్లో వెంటనే ప్రత్యేక తనిఖీలు నిర్వహించాలి. ఆసుపత్రుల్లో ఫైర్ సేఫ్టీ నిబంధనలు, ఎన్ఓసీ ఉందో లేదో పరిశీలించి, భద్రతా ప్రమాణాలు లేని ఆసుపత్రులపై కఠిన చర్యలు తీసుకోవాలి. నిబంధనలు ఉల్లంఘిస్తున్న ఆసుపత్రులకు వెంటనే నోటీసులు జారీ చేసి, అవసరమైతే వాటి కార్యకలాపాలను తక్షణమే నిలిపివేయాలి. ​ రోగుల భద్రతను దృష్టిలో ఉంచుకుని ఆసుపత్రుల నిర్వహణను ఎప్పటికప్పుడు పర్యవేక్షించేందుకు ప్రత్యేక తనిఖీ వ్యవస్థను ఏర్పాటు చేయాలి. ​ప్రజల ఆరోగ్యం, ప్రాణ భద్రతతో చెలగాటమాడే ప్రైవేట్ ఆసుపత్రులపై , వాటి నిర్వాహకులపై చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. వైద్యశాఖ తక్షణమే స్పందించకపోతే, అఖిల భారత యువజన సమాఖ్య ఆధ్వర్యంలో వైద్యశాఖలోని అక్రమాలు, అవినీతికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతామని పోలోజు రంజిత్, బ్రాహ్మణపల్లి యుగంధర్ హెచ్చరించారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>