కలం, లోకేశ్వరం: లోకేశ్వరం మండలం అబ్దుల్లాపూర్ గ్రామంలోని (Abdullapur village) మోక్ష గణపతిని (Moksha Ganapathi Temple) ముథోల్ ఎమ్మెల్యే పవార్ రామారావు పటేల్ సోమవారం దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఎమ్మెల్యేకు ఆలయ కమిటీ సభ్యులు ఘన స్వాగతం పలికి శాలువాతో సన్మానించారు. అనంతరం మోక్ష గణపతి జ్ఞాపికను అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ మోక్ష గణపతి ఆశీస్సులతో వర్షాలు సమృద్ధిగా కురిసి పంటలు బాగా పండాలని ఆకాంక్షించారు. రైతులు సుఖసంతోషాలతో, సుభిక్షంగా ఉండాలని ప్రార్థించినట్లు తెలిపారు. వచ్చే ఏడాది నిర్వహించనున్న పుష్కరాల్లో 12 రోజుల పాటు అన్నదానం నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. అన్నదాన కార్యక్రమానికి ప్రజలు సహకరించాలని కోరారు.

