కలం, వెబ్ డెస్క్ : అక్కినేని అఖిల్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ “లెనిన్”.. (Lenin) వినరో భాగ్యమో విష్ణు కథ ఫేమ్ మురళీ కిశోర్ అబ్బుర ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాను సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై నాగవంశీ గ్రాండ్ గా నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో అఖిల్ సరసన క్యూట్ బ్యూటీ భాగ్యశ్రీ బోర్స్ హీరోయిన్ గా నటిస్తుంది.. స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ తమన్ మ్యూజిక్ అందిస్తున్న ఈ సినిమా రా అండ్ రస్టిక్ లవ్ అండ్ ఎమోషనల్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతుంది. అయితే గతంలో ఈ సినిమాలో హీరోయిన్ గా శ్రీలీలను ప్రకటించి పోస్టర్ కూడా రిలీజ్ చేశారు. కానీ కొన్ని అనుకోని కారణాల శ్రీలీల ఈ సినిమా నుంచి తప్పుకుంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ దశలో ఉంది.. ఏజెంట్ ఫ్లాప్ తో డీలా పడ్డ అఖిల్ ఎలాగైన లెనిన్ (Lenin) తో సూపర్ హిట్ అందుకోవాలనే కసితో ఉన్నాడు. ఇదిలా ఉంటే లెనిన్ మూవీకి సంబంధించి ఇంట్రెస్టింగ్ అప్డేట్ వైరల్ అవుతుంది. ఈ సినిమాలోని ఫస్ట్ సింగిల్ ను ఈ నెల 5వ తేదీన విడుదల చేస్తున్నట్లు మేకర్స్ ప్రకటించారు.


