కలం, వెబ్ డెస్క్ : తెలంగాణ రాష్ట్ర నదీ జలాలకు బీఆర్ఎస్ పార్టీ మరణశాసనం రాసింది అని నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి (Uttam Kumar Reddy) అన్నారు. నీటి వాటాలపై ప్రజాభవన్ లో ఆయన పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. ఈ కార్యక్రమానికి సీఎం రేవంత్ రెడ్డి, టీ పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్, మంత్రులు హాజరయ్యారు. ఈ సందర్బంగా ఉత్తమ్ కుమార్ రెడ్డి నీటి సంబంధిత అంశాలపై వివరణ ఇచ్చారు.
రాయలసీమ ఎత్తిపోతల పథకం కోసమే పీఆర్ఎల్ఐసీ సామార్థ్యాన్ని ఒక టీఎంసీకి కుదించారని, ఏపీలో అలయ్–బలయ్ చేసుకుని తెలంగాణ ప్రయోజనాలను బీఆర్ఎస్ (BRS) నాయకులు తాకట్టు పెట్టారని ఆరోపించారు. పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని జూరాల నుండి శ్రీశైలం ఎందుకు మార్చారు అని ఉత్తమ్ నిలదీశారు. పీఆర్ఎల్ఐసీ 90% పూర్తయిందనడం అబద్ధమని, ప్రాజెక్టును పూర్తి చేయడానికి ఇంకా రూ.80 వేలకు పైగా వ్యయం అవుతుందన్నారు.
బీఆర్ఎస్ పదేళ్ల పాలనలో ఈ ప్రాజెక్టు నిర్మాణానికి కేవలం రూ.27వేల కోట్లు మాత్రమే ఖర్చు పెట్టిందని, కాంగ్రెస్ (Congress) ప్రభుత్వం వచ్చాక రెండేళ్లలోనే రూ.7 కోట్లు కేటాయించినట్లు తెలిపారు. జలాశయాల్లో తెలంగాణ వాటా పరిరక్షణకు తమ ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందన్నారు. కృష్ణా జల వివాదాల ట్రిబ్యునల్ లో వాదనలు గట్టిగా విపిస్తున్నామని చెప్పుకొచ్చారు. దీనికి నిదర్శనం జగన్ ఏపీ సీఎం చంద్రబాబు కు లేఖ రాయడమేనని చెప్పారు. కేసీఆర్ ప్రభుత్వంలో సాగునీటి రంగం నిర్లక్ష్యానికి గురి అయ్యిందని, నదీ జలాల అంశంపై బీఆర్ఎస్ ఆరోపణలు అర్ధరహితమని మంత్రి ఉత్తమ్ (Uttam Kumar Reddy) మండిపడ్డారు.
Read Also: అబద్ధాలకు రేవంత్ బ్రాండ్ అంబాసిడర్ : హరీశ్ రావు
Follow Us On: X(Twitter)


