కలం, వెబ్ డెస్క్ : మున్సిపల్ ఎన్నికలకు తెలంగాణ ప్రభుత్వం రెడీ అవుతోంది. గడువు ముగుస్తున్న మున్సిపాలిటీలు, మున్సిపల్ కార్పొరేషన్ల ఎన్నికలకు (Municipal Elections )సంబంధించి ముందస్తు ఏర్పాట్ల కోసం మొన్ననే నోటిఫికేషన్ ఇచ్చారు. తాజాగా ఎన్నికల సంఘం ఓటరు లిస్టు కోసం ప్రకటన జారీ చేసింది. మున్సిపల్ వార్డుల్లో ఓటరు లిస్టును సంబంధింత మున్సిపల్ కమిషనర్, ఆర్డీవో, కలెక్టర్ ఆఫీసుల్లో సమర్పించాలని ఆదేశించింది. గత మూడు రోజుల క్రితమే పట్టణ ఓటరు లిస్టు సవరణ కోసం ప్రకటన ఇచ్చింది. అది పూర్తి కావడంతో నేడు ఫైనల్ లిస్టును అందజేయాలని తెలిపింది.
చూస్తుంటే ఈ నెల 20 వరకు రిజర్వేషన్లను ఖరారు చేసి మున్సిపల్ ఎన్నికలకు (Municipal Elections) వెళ్లబోతున్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతం గడువు ముగిసిన 117 మున్సిపాలిటీలు, 6 మున్సిపల్ కార్పొరేషన్లకు ఫిబ్రవరి మొదటి వారంలో ఎన్నికలు నిర్వహించే అవకాశాలు కనిపిస్తున్నాయి. జనవరి 5న అన్ని పార్టీల ప్రతినిధులతో ఎన్నికల సంఘం సమీక్ష నిర్వహించబోతోంది. అన్ని పార్టీల నుంచి అభ్యంతరాలు స్వీకరించనుంది.
Read Also: రూ.900 కోట్ల విలువైన షేర్లు విరాళమిచ్చిన ఎలన్ మస్క్
Follow Us On: Sharechat


