రాష్ట్రవ్యాప్తంగా జరగనున్న బీసీ బంద్‌కు బీఆర్ఎస్, బీజేపీలతో పాటు తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత(Kavitha) కూడా సంపూర్ణ మద్దతు తెలిపారు. బీసీల కోసం తాము ఎంత దూరం వచ్చయినా పోరాడతామన్నారు. అనంతరం కాంగ్రెస్ పార్టీకి చురకలు కూడా అంటించారు. ఈ క్రమంలోనే ఆమె ఎక్స్(ట్విట్టర్) వేదికగా ఓ పోస్ట్ పెట్టారు. బీసీ బంద్‌లో బీసీ జేఏసీ ఛైర్మన్ కృష్ణయ్య(R Krishnaiah)కు పూర్తి మద్దతు ఇస్తామని ఆమె ప్రకటించారు. ‘‘తెలంగాణ అసెంబ్లీ, కౌన్సిల్ పాస్ చేసిన బిల్లులను ఆమోదించకుండా నెలల తరబడి పెండింగ్ లో పెట్టిన బీజేపీ ఇప్పుడు బంద్ లో పాల్గొంటోంది.. అంటే బీసీ రిజర్వేషన్ల బిల్లులు పాస్ చేసినట్టు భావించాలా? అసెంబ్లీ, కౌన్సిల్ లో బిల్లులు పాస్ చేసి కేంద్రంపై కొట్లాడకుండా ఉత్తుత్తి జీవో ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ తామే ముందుండి బంద్ చేయిస్తామనడం హాస్యాస్పదం’’ అని ఎద్దేవా చేశారు.
Read Also: రేవంత్ ప్రభుత్వంపై హైకోర్టు హైప్రెజర్..!

