కలం, వెబ్ డెస్క్ : ప్రపంచ కుబేరుడు ఎలన్ మస్క్ (Elon Musk) ఉదారత చాటుకున్నాడు. తన కంపెనీకి చెందిన 100 మిలియన్ డాలర్ల విలువైన 200ల షేర్లను స్వచ్ఛంద సంస్థకు విరాళంగా ఇచ్చారు. వీటి విలువ ఇండియన్ కరెన్సీలో రూ.900 కోట్లకు పైగా ఉంటుంది. టెస్లా (Tesla) కంపెనీలో ఎలన్ మస్క్ కు ఉన్న షేర్లను ఏడాది చివరి ట్యాక్స్ ప్లానింగ్ లో భాగంగా విరాళంగా ఇచ్చినట్టు కంపెనీ తెలిపింది. గత కొన్నేళ్లుగా ఎలన్ మస్క్ ఇలాగే విరాళాలు ఇస్తున్నారు.
2024లో 112 మిలియన్ డాలర్ల షేర్లు విరాళంగా ఇచ్చారు. అంతకు ముందు 2021లో 5.74 బిలియన్ డాలర్ల షేర్లు, 2022లో 1.95 బిలియన్ డాలర్ల షేర్లను స్వచ్ఛంద సంస్థలకు రాసిచ్చారు. అయితే ఎలన్ మస్క్ ఎప్పుడైనా సరే డబ్బులు ఇవ్వకుండా ఇలా షేర్లు ఇస్తూ వస్తుంటారు. పన్ను తగ్గించుకునే ప్లానింగ్ లో భాగంగా ఇలా షేర్లు విరాళంగా ఇస్తారనే ప్రచారం కూడా ఉంది. కానీ డబ్బులు ఇవ్వకుండా ఇలా షేర్లు ఇస్తే.. ఆ స్వచ్ఛంద సంస్థలు కూడా ఆర్థికంగా బలోపేతం అవుతాయని ఎలన్ మస్క్ (Elon Musk) గతంలో చెప్పాడు.

Read Also: ఆ సంతకమే కొంపముంచింది : రేవంత్ రెడ్డి
Follow Us On: Youtube


