రేవంత్, కేటీఆర్ దోస్తీపై బండి సంజయ్ హాట్ కామెంట్స్

కలం, వెబ్ డెస్క్ : సీఎం రేవంత్ రెడ్డి, కేటీఆర్ పై కేంద్రమంత్రి బండి సంజయ్ (Bandi Sanjay) కీలక వ్యాఖ్యలు చేశారు. రేవంత్, కేటీఆర్ ప్రాణ, ధన, ధాన దోస్తులని తీవ్ర ఆరోపణలు చేశారు. కాంగ్రెస్ అధిష్ఠానానికి కప్పటం కట్టేందుకే కట్టేందుకే భూదోపిడీపై బీఆర్ఎస్ తో రేవంత్ బేరసారాలు మొదలుపెట్టారన్నారు. భూముల విషయంలో అన్నీ ఆధారాలున్నా ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని బండి ప్రశ్నించారు. కాంగ్రెస్ నేతలను ఫాంహౌజ్ కు పంపడం పక్కా రాజకీయ డ్రామానే అని విమర్శించారు. స్నేహితులతో కేటీఆర్ క్విడ్ ప్రో కో దందా చేస్తున్నారని, కానీ లాభాలు మాత్రం ఆయన్నే కొట్టేస్తున్నాడని బండి సంజయ్ ఆరోపించారు.

ఖైరతాబాద్ ఉప ఎన్నికపై స్పందించిన బండి సంజయ్.. ఎన్నిక అనివార్యం అని స్పష్టం చేశారు. ఆ స్థానంలో ముస్లిం ఓట్లతో కాంగ్రెస్ గెలవాలని చూస్తోందన్నారు. మెజారిటీ హిందూ ఓటర్లు ఐక్యంగా ఉండలేరని కాంగ్రెస్ ధీమాగా ఉందని.. మజ్లిస్ తో జతకట్టి ఖైరతాబాద్ లో కాంగ్రెస్ గెలవాలని ప్రయత్నం చేస్తోందని ఆయన (Bandi Sanjay) ఆరోపించారు. కాంగ్రెస్, బీఆర్ఎస్, మజ్లిస్ కుట్రలను గమనించాలని బండి సంజయ్ సూచించారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>