కలం, నిజామాబాద్ బ్యూరో: వినాయక చవితి వేడుకల్లో భాగంగా నిజామాబాద్ కలెక్టరేట్ (Nizamabad Collectorate)లో ప్రతిష్టించిన వినాయకుడికి శనివారం కలెక్టర్ భవేష్ మిశ్రా, పోలీస్ కమిషనర్ సాయి చైతన్య ప్రత్యేక పూజలు చేశారు. అదనపు కలెక్టర్ వి.భుజంగరావు సైతం గణనాథుడిని దర్శించుకుని అన్న ప్రసాద వితరణలో పాల్గొన్నారు. ట్రెసా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రమణ్ రెడ్డి, డీఎస్ఓ శ్రీకాంత్ రెడ్డి, సివిల్ సప్లైస్ డీఎం ప్రవీణ్ అన్న ప్రసాద వితరణకు సహకారం అందించారు. పూజా కార్యక్రమంలో ఆర్మూర్ సబ్ కలెక్టర్ అభిగ్యాన్ మాల్వియ, అదనపు డీసీపీ శుభం నగ్రాలే, ట్రైనీ కలెక్టర్ సురేష్, డీఆర్వో గీత, ఆర్డీఓ రాజేంద్ర కుమార్, కలెక్టరేట్ ఏఓ బాలరాజు, సూపరింటెండెంట్ శ్రీనివాస్, ప్రశాంత్, భాస్కర్, అన్ని శాఖల అధికారులు, ఉద్యోగులు పాల్గొన్నారు..

