పోలీసుల మానవత్వం.. వృద్ధురాలికి కానిస్టేబుల్, సీఐ సాయం

కలం, జనగామ : అనారోగ్యంతో ఉన్న మహిళకు సాయం చేసి జనగామ పోలీసులు (Jangaon Police) మానవత్వం చాటుకున్నారు. జనగామ జిల్లా కేంద్రంలోని వాస్తు గణపతి గుడి చౌరస్తా వద్ద వృద్ధురాలు ఆరోగ్య సమస్యల వల్ల కళ్ళు తిరిగి కిందపడింది. విధుల్లో భాగంగా ద్విచక్ర వాహనంపై వెళ్తున్న కానిస్టేబుల్ రాజ్‌కుమార్ గౌడ్ గమనించి ఆమెకు సహాయం అందించారు. అదే సమయంలో అటుగా వెళ్తున్న జనగామ సీఐ సత్యనారాయణరెడ్డి విషయం గమనించారు. వెంటనే తన వాహనాన్ని ఆపి వృద్ధురాలిని జనగామ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. సీఐ సత్యనారాయణరెడ్డి, కానిస్టేబుల్ రాజ్‌కుమార్ గౌడ్ స్పందించిన తీరును స్థానికులు అభినందించారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>