పోలీస్ ఉద్యోగార్థులకు గుడ్ న్యూస్.. ఉచిత శిక్షణకు అవకాశం!

కలం, నిర్మల్: పోలీస్ ఉద్యోగాలకు సిద్ధమవుతున్న నిరుద్యోగ యువత కోసం నిర్మల్ (Nirmal) జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా సహకారంతో ఉచిత ప్రీ–రిక్రూట్‌మెంట్ శిక్షణ (Police Recruitment Training ) నిర్వహిస్తున్నట్లు ఎస్పీ జానకి షర్మిల (Jai Sharmila) శనివారం తెలిపారు.

ఈ నెల 28వ తేదీన సోమవారం నుంచి నిర్మల్‌లో శిక్షణ తరగతులు ప్రారంభమవుతాయని వెల్లడించారు. పోలీస్ కానిస్టేబుల్, ఎస్సై తదితర ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు ఉదయం 10 నుంచి సాయంత్రం 5 వరకు శిక్షణ తరగతులు కొనసాగుతాయని పేర్కొన్నారు.

ఆసక్తి గల అభ్యర్థులు తమ పరిధిలోని పోలీస్ స్టేషన్ ఎస్‌హెచ్‌ఓను సంప్రదించి బయోడేటా సమర్పించాలని సూచించారు. సంబంధిత పోలీస్ స్టేషన్‌లో శిక్షణకు సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకుని అడ్మిషన్ పొందవచ్చని తెలిపారు. ఉచిత శిక్షణ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని పోటీ పరీక్షల్లో మంచి ఫలితాలు సాధించాలని ఆకాంక్షించారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>