epaper
Thursday, January 15, 2026
spot_img
epaper

వచ్చే ఏడాది ఆగస్టు 15న బుల్లెట్ రైలు.. మొదటి సర్వీస్ వీటి మధ్యే

కలం, వెబ్​ డెస్క్​ : భారతదేశ ఎంతో ఆతృతంగా ఎదురుచూస్తున్న ప్రజలు బుల్లెట్​ ట్రైన్ (Bullet Train) వచ్చే ఏడాది ఆగస్టు నాటికి పట్టాలెక్కనుంది. ఈ మేరకు కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్​ (Ashwini Vaishnaw) కీలక ప్రకటన చేశారు. గురువారం ఆయన రైల్​ భవన్​లో మీడియాతో మాట్లాడుతూ.. వచ్చే ఏడాది ఆగస్టు 15 నాటికి బుల్లెట్​ ట్రైన్ సిద్ధమవుతుందని చెప్పారు. మొదటి హై స్పీడ్​ ట్రైన్ సూరత్​ – బిలిమోరా మార్గంలో నడుస్తుందని తెలిపారు.

నేషనల్ హై స్పీడ్​ రైల్ కార్పొరేషన్​ లిమిటెడ్​ (NHSRCL) చేపట్టిన ఈ ప్రాజెక్టును దశల వారీగా ప్రారంభిస్తుందని కేంద్రమంత్రి తెలిపారు. మొదటి దశలో భాగంగా సూరత్​ – బిలిమెరా మార్గం నిర్మించననున్నట్లు చెప్పారు. ఆ తర్వతా వాపి – సూరత్​, వాపి– అహ్మదాబాద్​, థానే – అహ్మదాబాద్​ మార్గంలో సేవలు ప్రారంభమవుతాయన్నారు. చివరి దశలో ముంబై – అహ్మదాబాద్​ హై స్పీడ్​ రైల్​ కారిడార్​ మొత్తం అందుబాటులోకి వస్తుందని అశ్వినీ వైష్ణవ్​ వివరించారు.

ప్రాజెక్ట్​ వ్యయం 1,08,000 కోట్లు

508 కిలోమీటర్లు పొడవైన ముంబై – అహ్మదాబాద్​ హై స్పీడ్ రైల్​ (MAHSR) ప్రాజెక్టులో ముంబై, థానే, విరార్​, బోయిసర్​, వాపి, బిల్లిమోరా, సూరత్​, భరూచ్​, వడోదర, ఆనంద్​, అహ్మదాబాద్​, సబర్మతి అనే 12 స్టేషన్లు ఉన్నాయి. ఈ ప్రాజెక్టు అంచనా వ్యయం రూ. రూ. 1,08,000 కోట్లు కేటాయించారు. వీటిలో జపాన్​ కు చెందిన ఇంటర్నేషనల్​ కోఆపరేషన్​ ఏజెన్సీ రూ.88,000 కోట్ల నిధులు సమకూరుస్తోంది. డిసెంబర్​ 2029 నాటికి ముంబై – అహ్మదాబాద్​ హై స్పీడ్​ రైల్​ ప్రాజెక్టును పూర్తి చేయడానికి లక్ష్యంగా పెట్టుకున్న రైల్వే శాఖ. బుల్లెట్​ ట్రైన్ (Bullet Train)​ అందుబాటులోకి వస్తే ముంబై – అహ్మదాబాద్​ మద్య రెండు గంటల సమయం తగ్గుతుంది.

Read Also: అణు కేంద్రాల రక్షణ.. భారత్-పాక్ కీలక ఒప్పందం

Follow Us On: X(Twitter)

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>