epaper
Thursday, January 15, 2026
spot_img
epaper

విశ్వక్ సేన్ పొలిటికల్ డ్రామా ‘లెగసీ’

కలం, వెబ్ డెస్క్ : ఒకే తరహా సినిమాలు చేయకుండా విభిన్న పాత్రలు, భిన్నమైన కథలతో ముందుకెళ్తూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నారు మాస్ కా దాస్ విశ్వక్ సేన్ (Vishwak Sen). ఎక్కువ సినిమాలు చేయడం కంటే, నాణ్యమైన సినిమాలు చేయడానికి ప్రాధాన్యత ఇస్తూ.. ఉత్తమ వినోదాన్ని అందించడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నారు. సాయి కిరణ్ దైదా దర్శకత్వం వహించిన విమర్శకుల ప్రశంసలు పొందిన ‘పిండం’ చిత్రాన్ని నిర్మించిన కలాహీ మీడియా పతాకం పై తెరకెక్కుతోన్న రెండవ సినిమాలో విశ్వక్ సేన్ నటిస్తున్నారు. ‘లెగసీ’ (Legacy) అనే టైటిల్ తో రూపొందుతోన్న ఈ చిత్రానికి కూడా ‘పిండం’ సినిమాతో తన ప్రతిభను చాటుకున్న సాయి కిరణ్ దైదా రచన, దర్శకత్వం వహిస్తున్నారు. నూతన సంవత్సరం సందర్భంగా 2026 జనవరి 1న ఈ సినిమాను అధికారికంగా ప్రకటిస్తూ, అద్భుతమైన టీజర్ ను విడుదల చేసింది చిత్ర బృందం.

‘లెగసీ’ ఒక రాజకీయ నేపథ్యంతో సాగే కథ. అత్యంత ప్రభావవంతమైన రాజకీయ నాయకుడైన తన తండ్రి వారసత్వాన్ని అనివార్యంగా మోయవలసి వచ్చే సిద్ధార్థ్ అనే యువకుడి కథగా ఇది రూపొందుతోంది. వారసుడు లేని కుర్చీ చుట్టూ తిరిగే అవకాశవాద రాజకీయ రాబందులను తాను ఎంతగా ద్వేషిస్తాడో చెప్పే విశ్వక్ సేన్ వాయిస్ ఓవర్‌ తో టీజర్ ప్రారంభమవుతుంది. రాజకీయ క్రీడలు, ఉన్నత స్థానాన్ని పొందడానికి వేసే ఎత్తుగడలు, అవకాశవాద రాబందుల మోసం తనకు నచ్చకపోయినా.. వారసత్వాన్ని ఎవరో ఒకరి సమర్థ భుజాల పై మోయాల్సిన అవసరం ఉన్నందున, తాను ఆ బాధ్యతను చేపట్టాల్సి వచ్చిందని చెబుతాడు.

తన దివంగత తండ్రి స్మారక చిహ్నాన్ని సందర్శించడానికి వెళ్తున్నట్లు విశ్వక్ సేన్ (Vishwak Sen) పాత్రను పరిచయం చేశారు. అక్కడ అతను మృతదేహంపై మూత్ర విసర్జన చేసి, నూతన సంవత్సర శుభాకాంక్షలు చెప్పడం వైవిధ్యంగా ఉంది. ఆ తర్వాత రాజకీయ నాయకుల మధ్య అతను తుపాకీ పట్టుకొని కనిపించడం, తన గదిలో కాల్పులు జరగడం వంటి దృశ్యాలు ఉత్కంఠను పెంచాయి. క్రూరంగా, రూఢిగా, దుఃఖంతో నలిగిపోయిన, మనసు విరిగిపోయిన, మొరటు వ్యక్తిగా విశ్వక్ సేన్ అద్భుతంగా మెప్పించారు. ఆయన లుక్, నటన, స్క్రీన్ ప్రెజెన్స్ ఈ పొలిటికల్ డ్రామాపై ఆసక్తిని మరింత పెంచుతున్నాయి. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ ఫాస్ట్ గా జరుగుతోంది. త్వరలోనే మరిన్ని వివరాలను ప్రకటించనున్నారు.

Read Also: నయన్ నోట ప్రమోషన్ మాట.. షాక్ అయిన అనిల్ రావిపూడి..!!

Follow Us On: Pinterest

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>