కేశంపేటను ప్లాస్టిక్ రహితంగా మార్చాలని పిలుపు

కలం, వనపర్తి: కేశంపేట (Keshampet) గ్రామంలో ‘స్వచ్ఛతా హీ సేవ–2026’ కార్యక్రమంలో భాగంగా స్వచ్ఛ భారత్‌ మిషన్‌ (గ్రామీణ) కార్యక్రమాన్ని గురువారం ఘనంగా నిర్వహించారు. సర్పంచి బాదేపల్లి రేవతి సురేష్‌ గౌడ్‌, పంచాయతీ కార్యదర్శి ఎస్‌.అరవింద్‌ కుమార్‌ హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. గ్రామంలో పారిశుద్ధ్య లోపం లేకుండా చూడటం ప్రతి ఒక్కరి బాధ్యత అన్నారు. ఇళ్లతో పాటు పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలని సూచించారు. చెత్తను ఎక్కడపడితే అక్కడ వేయకుండా తడి, పొడి, శానిటరీ, హానికర చెత్తను వేర్వేరుగా విభజించి పంచాయతీ వాహనాలకు అందించాలని కోరారు.

స్వచ్ఛ భారత్‌ లక్ష్యాల సాధనలో ప్రజలు భాగస్వాములు కావాలని సర్పంచి రేవతి సురేష్‌ గౌడ్‌ పిలుపునిచ్చారు. ప్లాస్టిక్‌ రహిత గ్రామంగా మార్చేందుకు సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమం(Swachhata Hi Seva Campaign)లో ఏఎన్‌ఎం లలిత, ఆశ కార్యకర్తలు చింతచెట్టు కళావతి, చెన్నమ్మ, అంగన్‌వాడీ టీచర్‌ జయమ్మ, పాఠశాల ప్రధానోపాధ్యాయుడు వెంకటేష్‌, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.

Also Read : నిజామాబాద్‌లో యూట్యూబర్ వైష్ణవి భర్త హత్య

Follow Us On: X(Twitter)

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>