కలం, వరంగల్ బ్యూరో: హనుమకొండ (Hanumakonda)లో ఇటీవల వరుసగా జరుగుతున్న చోరీలతో జనాలు ఆందోళన చెందుతున్నారు. తాజాగా బాలసముద్రంలోని ఓ హాస్పిటల్ ముందు పార్క్ చేసిన బైక్ను ఇద్దరు వ్యక్తులు గురువారం ఎత్తుకెళ్లారు. పట్టపగలే ఇలా బైక్ దొంగతనం చేస్తుండగా.. సీసీ కెమెరాల్లో రికార్డ్ అయింది. చోరీ విషయాన్ని గుర్తించిన బైక్ యజమాని గుగులోతు వెంకన్న వెంటనే సుబేదారి పోలీసులకు ఫిర్యాదు చేశారు. వరుస చోరీల నేపథ్యంలో పోలీసులు నిఘా పెంచాలని, దొంగతనాలను నిరోధించాలని కోరుతున్నారు.

