కలం, కరీంనగర్ బ్యూరో: వ్యాధుల బారిన పడకుండా.. ప్రతి ఒక్కరూ పరిసరాలతో పాటు వ్యక్తిగత పరిశుభ్రత పాటించాలని ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ, దివ్యాంగుల సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ (Adluri Laxman Kumar) పేర్కొన్నారు. ఈనెల 17 నుంచి అక్టోబర్ 2 వరకు స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమాలు నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో గురువారం కలెక్టరేట్ వద్ద స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమాల పోస్టర్ ను కలెక్టర్ చిత్రా మిశ్రా, అదనపు కలెక్టర్ (రెవిన్యూ) శ్రీనివాసరెడ్డి, నగరపాలిక కమిషనర్ ప్రపుల్ దేశాయ్, ఆర్డిఓ షర్మిల, డీఆర్డీఓ గీత తదితర అధికారులతో కలిసి మంత్రి ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. గ్రామాలు, పట్టణాల్లో స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమాలు చేపట్టాలన్నారు. శుభ్రతకు పెద్దపీట వేస్తూ.. ప్లాస్టిక్ నిర్మూలన, చెత్త చెదారం తొలగింపునకు పారిశుద్ధ్య చర్యలు చేపట్టాలన్నారు. పట్టణాలు, గ్రామాలు శుభ్రంగా ఉంటేనే దేశం అభివృద్ధి బాటలో నడుస్తుందని పేర్కొన్నారు.

