కలం, నిర్మల్: నిర్మల్ (Nirmal) జిల్లా కేంద్రంలో కేశవ సేవా సంఘం (Keshava Seva Sangham) ఆధ్వర్యంలో తెలంగాణ విమోచన దినోత్సవ వేడుకలను గురువారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సర్దార్ వల్లభ్‌బాయ్ పటేల్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి మంచిర్యాల నాగభూషణం జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం తెలంగాణ విమోచన పోరాటంలో పాల్గొన్న వీరుల త్యాగాలను స్మరించుకున్నారు.
తెలంగాణ ప్రజలు స్వేచ్ఛా వాయువులు పీల్చుకునేందుకు నాటి పోరాట యోధులు చేసిన త్యాగాలు చిరస్మరణీయమని పేర్కొన్నారు. వారి త్యాగాలను నేటి తరానికి తెలియజేయాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. ఈ కార్యక్రమంలో కేశవ సేవా సంఘం సభ్యులు కిన్నెర్ల రవి, సిర్ప సంతోష్, తుమ్మనపల్లి సుదర్శన్ చారి, ధీరజ్, మహేష్ తదితరులు పాల్గొన్నారు.

