కలం, వెబ్ డెస్క్: నిజామాబాద్ లో యూట్యూబర్ వైష్ణవి (YouTuber Vaishnavi) భర్త హత్యకు గురయ్యారు. నడిరోడ్డుపై కారులో వచ్చి భర్త హరిబాబును దుండగులు కత్తులతో పొడిచి చంపారు. గతంలో యూట్యూబర్ వైష్ణవిని హరిబాబు (Vaishnavi Husband Haribabu) హత్య చేశారు. అదనపు కట్నం కోసం గర్భిణీ అయిన వైష్ణవిని హరిబాబు చంపాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. సీసీ ఫుటేజీ ఆధారంగా నిందితుల కోసం గాలిస్తున్నారు. ఈ దారుణ ఘటనకు సంబంధించి మరింత సమాచారం తెలియాల్సి ఉంది.

