7,437 పోలీస్ ఉద్యోగాలకు పరీక్షా తేదీలు ఖరారు

కలం, వెబ్ డెస్క్: తెలంగాణలో ఇటీవల నోటిఫికేషన్ విడుదలైన 7,437 పోలీస్ ఉద్యోగాలకు (Telangana Police Jobs) నిర్వహించే ప్రిలిమ్స్ పరీక్షల తేదీలు ఖరారయ్యాయి. ఎస్సై అభ్యర్థులకు నవంబర్ 29న, కానిస్టేబుల్ అభ్యర్థులకు డిసెంబర్ 20న పరీక్షలు జరుగనున్నాయి. ఈ మేరకు రాష్ట్ర పోలీస్ నియామక మండలి (TSLPRB) ఒక ప్రకటనలో వెల్లడించింది. రాష్ట్రంలో మొత్తం 7,437 పోలీస్ పోస్టుల భర్తీ ప్రక్రియను చేపడుతూ జులై 29న టీఎస్ఎల్పీఆర్బీ నోటిఫికేషన్ విడుదల చేయడం తెలిసిందే. ఈ నోటిఫికేషన్‌ ద్వారా సివిల్ పోలీస్ కానిస్టేబుల్ (3,697), ఏఆర్ కానిస్టేబుల్ (1,052), ఎస్‌ఏఆర్‌ పీపీఎల్‌ కానిస్టేబుల్ (24), స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్, కానిస్టేబుల్ (1,380), ఫైర్ ఫైటర్ (751), జైలు వార్డర్ (208) వంటి ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు.

Also Read : కేసీఆర్ ఫామ్‌హౌస్ భూములు.. నోటీసులకు రెవెన్యూ శాఖ కసరత్తు

Follow Us On: X(Twitter)

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>