నిర్మల్ కలెక్టరేట్‌లో గణపయ్యకు ప్రత్యేక పూజలు చేసిన కలెక్టర్

కలం, నిర్మల్: నిర్మల్ (Nirmal) జిల్లా సమీకృత కలెక్టరేట్ ప్రాంగణంలో జిల్లా అధికారులు, ఉద్యోగులు భక్తిశ్రద్ధలతో ప్రతిష్టించిన బొజ్జ గణపయ్యకు జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా (Collector Bhavesh Mishra) గురువారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ గణనాథుడికి పుష్పాలు సమర్పించి, ప్రత్యేక పూజలు, హారతి కార్యక్రమాల్లో పాల్గొన్నారు.

విఘ్నేశ్వరుడి ఆశీస్సులతో జిల్లా ప్రజలందరూ సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని ప్రార్థించారు. వినాయక చవితి ఉత్సవాలు శాంతియుతంగా, భక్తి శ్రద్ధలతో సాగాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా ఉద్యోగులు మాట్లాడుతూ.. గణనాథుడి నిమజ్జనం సందర్భంగా శుక్రవారం కలెక్టరేట్ ప్రాంగణంలో ప్రత్యేకంగా అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>