రోహిన్ రెడ్డి(Rohin Reddy)పై బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్(RS Praveen Kumar) సంచలన ఆరోపణలు చేశారు. అంతేకాకుండా మంత్రుల స్థానాల్లో మాఫియా డాన్‌లు కూర్చున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజల కోసం పని చేయాల్సిన వాళ్లు సొంత దుకాణాలు పెట్టి రాష్ట్రంతో వ్యాపారం చేస్తున్నారని విమర్శలు చేస్తారు. తెలంగాణ కుక్కలు చింపిన విస్తరిలా మారుతుందని తాను కలలో కూడా అనుకోలేదని, ప్రజలు ఓటేస్తే మంత్రులుగా అయ్యి, వారి దుకాణాలు ఓపెన్ చేసుకొని, ప్రజల జీవితాలతో ఆడుకుంటారు అని ఎప్పుడూ అనుకోలేదని అన్నారు. అనంతరం రోహిన్ రెడ్డిపైనా విమర్శలు చేశారు. రోహిన్ తన గెస్ట్ హౌస్‌ను మరో సెక్రటేరియట్‌లా మార్చుకున్నాడని అన్నారు.
‘‘ఆఫీసియల్‌గా సెక్రటేరియట్‌లో జరగాల్సినవి రోహిన్ రెడ్డి గెస్ట్ హౌస్లో ఎందుకు జరుగుతున్నాయి. కొండా సురేఖ గారి కూతురు సుస్మిత(Konda Sushmitha) నిజం చెప్పింది.. అసలు కాల్ డీటెయిల్స్ తీయాల్సినవి రేవంత్ రెడ్డివి, రోహిన్ రెడ్డివి, పొంగులేటివి, ఉత్తమ్ కుమార్ రెడ్డివి. వీళ్ళ అందరి కాల్ డీటెయిల్స్ ఇస్తే ఈ దొంగల ముఠా గూడుపుఠాని బైట పడుతుంది. ఆ సుమంత్ అనే వ్యక్తిని ఎందుకు అరెస్ట్ చేయలేక పోతున్నారు. అసలు రోహిన్ రెడ్డికి, సుమంత్‌కి ఏం సంబంధం. అసలు తల మీద పిస్టల్ పెట్టి పంచాయితీలు చేసుడు ఏంది.. అసలు ఒక సివిలియన్ చేతులోకి పిస్టల్ ఎలా వచ్చింది?’’ అని RS Praveen Kumar ప్రశ్నించారు.
Read Also: రోహిన్ రెడ్డిపై పార్టీకి ఫిర్యాదు.. బెదిరించారంటూ..

