తెలంగాణ రాష్ట్రంలో మంత్రుల కుమ్ములాటలపై బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్(RS Praveen Kumar) ఘాటు వ్యాఖ్యలు చేశారు. వాళ్లు వాళ్లు కొట్టుకోవడానికే ఈ మంత్రులకు సమయం సరిపోవట్లేదని, వీళ్లు రాష్ట్రాన్ని ఏం రక్షిస్తారంటూ విమర్శలు చేశారు. ఒకరి తర్వాత ఒకరు అన్నట్లు మంత్రులంతా కూడా కొట్లాడుకోవడంలో బిజీగా ఉన్నారన్నారు. ‘‘కాంట్రాక్టుల కోసం, కమిషన్ల కోసం కొట్టుకునే మంత్రులు రాష్ట్రాన్ని ఏం రక్షిస్తారు? అడ్లూరి లక్ష్మణ్, పొన్నం ప్రభాకర్ కొట్టుకుంటున్నారు. అడ్లూరి లక్ష్మణ్, వివేక్ వెంకటస్వామి కొట్టుకుంటున్నారు. పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి(Ponguleti), కొండా సురేఖ(Konda Surekha) కొట్లాడుకుంటున్నారు. సీతక్క నియోజకవర్గంలో పొంగులేటికి ఏం అవసరమని పొంగులేటి మనుషులు అంటారు. ఇదంతా రాజ్యం నాది అని రేవంత్ రెడ్డి అంటాడు’’ అని విమర్శలు గుప్పించారు ఆర్ఎస్‌పీ.
‘‘సామాన్య ప్రజలకు ఒక న్యాయం, మంత్రులకు ఒక న్యాయమా. మంత్రి మనిషి గన్‌తో బెదిరిస్తే కూడా ఇప్పటి వరకు ఎఫ్ఐఆర్ ఎందుకు నమోదు చేయలేదు, నిందితులను ఎందుకు అదుపులోకి తీసుకోలేదు. సోషల్ మీడియాలో ఒక ట్వీట్ చేస్తే అరెస్ట్ చేస్తున్నారు. కేటీఆర్ ఏసీబీ ఆఫీసు నుండి తెలంగాణ భవన్‌కు నడిచి వస్తే కేసు పెట్టారు.. మన్నె క్రిశాంక్ ట్వీట్ చేస్తే 10 కేసులు పెట్టారు. ఇది ప్రజా పాలన కాదు ప్రతీకార పాలన అని వాట్సప్ గ్రూపులో పెడితే అరెస్ట్ చేశారు. అలాంటిది మంత్రి మనిషి ఒక సిమెంట్ కంపెనీ యాజమాన్యంపై గన్‌తో బెదిరిస్తే ఇప్పటి వరకు అతని మీద పోలీసులు కేసు నమోదు చేయలేదు’’ అని RS Praveen Kumar ప్రశ్నించారు.
Read Also: రోహిన్ రెడ్డిపై పార్టీకి ఫిర్యాదు.. బెదిరించారంటూ..

