ఎరుపు VS తెలుపు డ్రాగన్ ఫ్రూట్.. ఆరోగ్యానికి ఏది బెస్ట్?

కలం, వెబ్ డెస్క్: మన ఆరోగ్యానికి పండ్లు ఎంతో మేలు చేస్తాయి. ఈ క్రమంలోనే ప్రస్తుతం చాలామంది విదేశీ పండ్లును కూడా అమితంగా ఇష్టపడుతూ తింటున్నారు. ఈ మధ్యకాలంలో మనకు మార్కెట్లలో విరివిగా లభిస్తున్న అటువంటి పండ్లలో ‘డ్రాగన్ ఫ్రూట్’ (Dragon Fruit) ఒకటి. ఇది చూడటానికి ఎంతో ఆకర్షణీయంగా ఉండటమే కాకుండా, శరీరానికి అవసరమైన విటమిన్ – సి, ఫైబర్, యాంటీఆక్సిండెంట్లను పుష్కలంగా అందిస్తుందని చెబుతున్నారు ఆరోగ్యనిపుణులు. రోగనిరోధక శక్తిని పెంచడానికి, జీర్ణక్రియను మెరుగుపరచడానికి ఇది ఎంతగానో తోడ్పడుతుందని చెబుతున్నారు.

డ్రాగన్ ఫ్రూట్ ఎరుపు, తెలుపు గుజ్జు రకాలలో లభిస్తుంది. ఈ రెండు రకాలలోనూ నీరు, పీచు పదార్థం, విటమిన్లు, యాంటీ ఆక్సిడెంట్లు వంటి పోషకాలు ఉన్నప్పటికీ కొన్ని పోషకాల పరంగా స్వల్ప తేడాలున్నాయని చెబుతున్నారు నిపుణులు. అయితే ఈ రెండింటిలో ఏది ఆరోగ్యానికి ఎక్కువ మేలు చేస్తుందో (Dragon Fruit Benefits) ఇప్పుడు తెలుసుకుందాం.

ఎరుపు డ్రాగన్ ఫ్రూట్

డ్రాగన్ ఫ్రూట్ కు ఆకర్షణీయమైన గాఢ ఎరుపు రంగు రావడానికి దానిలో ఉండే బీటాసైనిక్ వంటి సహజ వర్ణద్రవ్యాలే ప్రధాన కారణంగా చెబుతున్నారు. ఈ పండులో యాంటీ ఆక్సిడెంట్ సమ్మేళనాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి శరీరంలోని ఫ్రీ రాడికల్స్ తో పోరాడి, కణాలు దెబ్బతినకుండా కాపాడటమే కాకుండా ఆక్సీకరణ ఒత్తిడిని తగ్గించడంలో అద్భుతంగా సహాయపడతాయని చెబుతున్నారు.

తెలుపు డ్రాగన్ ఫ్రూట్

ఇది గులాబీ లేదా ఎరుపు రంగు తొక్కను కలిగి ఉండి, లోపల నల్లటి గింజలతో కూడిన తెల్లటి గుజ్జు ఉంటుంది. ఎరుపు రకంతో పోలిస్తే కాస్త తక్కువ తీపిని కలిగి ఉంటుంది. దీనిలో పీచు పదార్థం చాలా ఎక్కువగా ఉంటుంది. ఇది ప్రేగుల కదలికను మెరుగుపరిచి, మలబద్ధకం సమస్యను సమర్థవంతంగా నివారిస్తుందని చెబుతున్నారు నిపుణులు.

ఎరుపు Vs తెలుపు.. ఏది బెస్ట్?

రెండు రకాలలోనూ ఆరోగ్యానికి ఉపయోగపడే పోషకాలు ఉన్నాయి. ఎరుపు డ్రాగన్ ఫ్రూట్ (Dragon Fruit) లో కొన్ని యాంటీ ఆక్సిడెంట్‌ సమ్మేళనాలు ఎక్కువగా ఉంటాయి. దీనిలో ఐరన్ కంటెంట్ కూడా ఎక్కువగా ఉండటంతో రక్తహీనత ఉన్నవారికి చాలా బాబా మేలు చేస్తుంది. అయితే తెల్ల డ్రాగన్ ఫ్రూట్ లో యాంటీ ఆక్సిడెంట్లు, ఐరన్ సాధారణ స్థాయిలో ఉంటాయి.

చర్మ సౌందర్యం కావాలనుకునేవారు, హిమోగ్లోబిన్ శాతం పెరగాలనుకునేవారికి ఎరుపు రకం ఎక్కువగా ఉపయోగపడుతుందని చెబుతున్నారు నిపుణులు.

అదే విధంగా బరువు తగ్గాలనుకునేవారికి, డైట్ ఫాలో అవుతూనే రక్తంలో చక్కెర స్థాయిలను అదుపులో ఉంచుకోవాలి అనుకునేవారికి తెలుపు రకం ఉపయోగపడుతుందని చెబుతున్నారు. అయితే ఏ రంగు డ్రాగన్ ఫ్రూట్ అయినా మితంగా తీసుకోవడం ముఖ్యమని సూచిస్తున్నారు ఆరోగ్య నిపుణులు.

Also Read : ఒంటరితనంతో ఆరోగ్యానికి ప్రమాదకరం.. WHO ఏం చెబుతుందంటే!

Follow Us On: X(Twitter)

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>