కలం, వెబ్ డెస్క్: ఎంతో సంబురంగా కొనుక్కున్న కొత్త ఫ్రిడ్జ్ ఆ కుటుంబం పాలిట శాపంగా మారింది. అందరూ గాఢ నిద్రలో ఉండగా.. ఫ్రిడ్జ్ బాంబులా పేలిపోవడంతో (Refrigerator Blast) నలుగురు నిద్రలోనే ప్రాణాలు కోల్పోయారు. కర్ణాటక రాష్ట్రంలో చోటు చేసుకున్న ఈ ఘటన సంచలనంగా మారింది. బెళగావిలోని చమౌలి గల్లీలో శారద డమోలి, రాజారం కుటుంబం సోమవారం కొత్త ఫ్రిడ్జ్ కొనుగోలు చేసి, ఇంటికి తీసుకొచ్చారు.
రాత్రి అంతా నిద్రపోయాక ఒక్కసారిగా ఫ్రిడ్జ్ పేలిపోయింది. ఈ ఘటనలో శారదతో పాటు ఆమె కుమార్తెలు ప్రియా, గంగ, మరో మహిళ సజీవ దహనం అయ్యారు. రాజారం, రోషన్ ప్రాణాలతో బయటపడ్డారు. స్థానికులు వెంటనే స్పందించి, ఇద్దరినీ ఆసుపత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

