అల్వాల్‌లో దారుణం.. బాలికను కిడ్నాప్ చేసి!

కలం, వెబ్ డెస్క్: హైదరాబాద్ అల్వాల్‌ (Alwal)లో దారుణం చోటు చేసుకుంది. బాలికపై గ్యాంగ్ రేప్ జరిగింది. 9 మంది యువకులు బాలికపై అఘాయిత్యానికి పాల్పడినట్లు పోలీసులు వెల్లడించారు. మూడు రోజుల పాటు బాలికను పలు ప్రాంతాలకు తీసుకెళ్లి మరీ అత్యాచారం చేసినట్లు వివరించారు. బాలికకు బాగా తెలిసిన యువకుడు.. ఆమెను నమ్మించి కిడ్నాప్ చేసి శామీర్ పేట ప్రాంతానికి తీసుకెళ్లాడు. మరుసటి రోజు మేడ్చల్ ప్రాంతానికి తీసుకెళ్లి.. ఖాళీగా ఉన్న రైలు బోగీలో అఘాయిత్యం చేశారు.

మూడు రోజుల పాటు దుండగుల చేతిలో నరకం అనుభవించిన బాలిక.. ఎట్టకేలకు ఇంటికి చేరుకుంది. అనంతరం తల్లిదండ్రులతో కలిసి అల్వాల్ పోలీసులకు ఫిర్యాదు చేయగా.. 9 మందిపై పోక్సో కేసు నమోదు చేశారు. నలుగురు పరారీలో ఉన్నారని, వారి కోసం వెతుకుతున్నట్లు తెలిపారు. బాలికను ఆరోగ్య పరీక్షల కోసం ప్రభుత్వాసుపత్రికి తరలించారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>