కలం, వెబ్‌డెస్క్: భారత రక్షణ పరిశోధన, అభివృద్ది సంస్థ(డీఆర్డీవో) ఖాతాలో మరో ఘనత చేరింది. ఒకే లాంఛర్ నుంచి రెండు మిస్సైల్స్‌ను విజయవంతంగా ప్రయోగించింది. ఒడిశాలోని (Odisha) చాందీపూర్‌లో ఉన్న డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం అంతరిక్ష కేంద్రం నుంచి బుధవారం ఈ ప్రయోగం జరిపింది. ఒకే లాంఛర్ నుంచి రెండు ‘ప్రళయ్’ క్షిపణుల (Pralay Missiles) ను సక్సెస్‌ఫుల్‌గా ప్రయోగించింది. ఈ మిస్సెల్స్‌ను నిర్ణీత వ్యవధిలో ఒకే లాంచర్ నుంచి ప్రయోగించి, పరీక్షించడం గత ఆరునెలల్లో ఇది రెండోసారి. యూజర్ ఎవాల్యుయేషన్ ప్రక్రియలో భాగంగా ఈ టెస్ట్ నిర్వహించినట్లు రక్షణ మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. మిస్సెల్స్ నిర్దేశిత రూట్లో టార్గెట్‌ను ఛేదించాయని చెప్పింది. ఈ మేరకు ఇంటెగ్రేటెడ్ టెస్ట్ రేంజ్(ITR) ఏర్పాటుచేసిన ట్రాకింగ్ సెన్సార్లు ధ్రువీకరించినట్లు పేర్కొంది. టార్గెట్స్‌కు దగ్గరలో మోహరించిన నౌకల్లోని టెలిమెట్రీ సిస్టమ్స్ కూడా నిర్దారించినట్లు తెలిపింది.
కాగా, ప్రళయ్ (Pralay Missiles).. దేశీయంగా అభివృద్ధి చేసిన బాలిస్టిక్ క్షిపణి. ఘన ఇంధనంతో పనిచేస్తుంది. అత్యాధునిక గైడెన్స్, నావిగేషన్స్ ఉన్నాయి. టార్గెట్‌ను ఛేదించడంలో అత్యంత కచ్చితత్వంతో పనిచేస్తుంది. అన్నింటికంటే ముఖ్యంగా వివిధ దశల్లోని లక్ష్యాలను ఒకేసారి ఛేదించడానికి వేర్వేరు వార్హెడ్లను మోసుకెళ్తుంది. ప్రళయ్ మిస్సైల్స్‌ను హైదరాబాద్ డీఆర్డీవోలోని రీసెర్చ్ సెంటర్ ఇమారత్(RCI) డెవలప్ చేసింది. ఇందులో డీఆర్డీవోకు చెందిన వివిధ లేబొరేటరీలు భాగస్వామ్యమయ్యాయి. ప్రయోగం విజయవంతం కావడంతో డీఆర్డీవోకు కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ అభినందనలు తెలిపారు.
Read Also: 2025లో AI ఎఫెక్ట్ ఏ రంగం మీద పడింది?
Follow Us On: X(Twitter)


