epaper
Thursday, January 15, 2026
spot_img
epaper

హాస్టల్​ బాత్​రూమ్​లో సీక్రెట్​ కెమెరా.. ప్రేమ జంట అరెస్ట్​

కలం, వెబ్​ డెస్క్​ : మహిళా హాస్టల్​లోని స్నానాల గదిలో సీక్రెట్​ కెమెరా (Secret Camera) పెట్టిన ఇద్దరిని పోలీసులు అరెస్ట్​ చేశారు. తమిళనాడులోని (Tamil Nadu) కృష్ణగిరి జిల్లా ఉత్పన్నపల్లి పరిధిలో ఉన్న లాలిక్కల్​ గ్రామంలో ఓ ప్రైవేట్ ఉమెన్స్​ హాస్టల్​ ఉంది. ఇందులో ఒడిశా రాష్ట్రానికి చెందిన నీలుకుమారి గుప్తా (26) ఉంటోంది. అయితే, నీలుకుమారి పంజాబ్​ కు చెందిన తన ప్రియుడు రవిప్రతాప్​ సింగ్​ (29) చెప్పడంతో హాస్టల్​ లోని స్నానాల గదిలో సీక్రెట్​ కెమెరా అమర్చింది.

ఈ విషయం బయటపడడంతో హాస్టల్​ యాజమాన్యం పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ నేపథ్యంలో పోలీసులు ప్రేమికులిద్దరిని అదుపులోకి తీసుకున్నారు. వీరిపై గుండా చట్టం కింద కేసు నమోదు చేయాలని జిల్లా ఎస్పీ తంగదురై కలెక్టర్​ కు సిఫారసు చేశారు. అనంతరం రవిప్రతాప్​ సింగ్​ని సేలం సెంట్రల్​ జైలుకు, నీలుకుమారి గుప్తాను కోవై మహిళా జైలుకు పోలీసులు తరలించారు.

Read Also: ఆటో డ్రైవర్​ టు ఎయిర్​లైన్స్​ ఓనర్​.. ‘శంఖ్​ ఎయిర్​’ చైర్మన్​ ఇన్​స్పైరింగ్​ జర్నీ

Follow Us On: X(Twitter)

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>