కాంగ్రెస్, బీఆర్ఎస్ కుమ్మక్కు రాజకీయాలు: రామనాథ్

కలం, నిర్మల్: అసెంబ్లీలో ప్రజా సమస్యలపై చర్చ జరగకుండా కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు కుమ్మక్కు రాజకీయాలకు పాల్పడుతున్నాయని బీజేపీ సీనియర్ నేత రావుల రామనాథ్ (Ravula Ramanath) ఆరోపించారు. నిర్మల్ జిల్లా కేంద్రంలో మీడియాతో మాట్లాడారు. 22ఏ నిషేధిత భూములు, ఫీజు రీ ఎంబర్స్‌మెంట్, నిరుద్యోగం, ఉద్యోగ సమస్యలు, రైతులు, విద్యార్థుల సమస్యలపై విస్తృతంగా చర్చ జరగాలని డిమాండ్ చేశారు.

బీజేఎల్పీ నేత, ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి సూచించినట్లుగా అసెంబ్లీ సమావేశాలను కనీసం 15 రోజుల పాటు నిర్వహించాలని రావుల రామనాథ్ సూచించారు. ఏపీలో కూటమి ప్రభుత్వం వినాయక చవితి సందర్భంగా మండపాలకు ఉచిత విద్యుత్ అందించడాన్ని స్వాగతిస్తున్నామని తెలిపారు. తెలంగాణలోనూ ఉచిత విద్యుత్ అందించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో బీజేవైఎం జిల్లా అధ్యక్షులు నిరంజన్ రెడ్డి, విజయ్, దీక్షిత్ రెడ్డి, ఉదయ్ గౌడ్ పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>